తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవే హాట్ టాపిక్ లు!

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సరిగ్గా బడ్జెట్ సమావేశాలు ముగిసిన ఆరు నెలలకు తెలంగాణ అసెంబ్లీ తిరిగి ఈరోజు సమావేశమైంది. అయితే ఈటల రాజేందర్ బహిష్కరణ, హుజూరాబాద్ ఉప ఎన్నిక, దళితబందు ప్రకటన, తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం… తదనంతర పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో… ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.

 

 

assembly

ఐదు బిల్లులు:

ఈ సమావేశాల్లో అధికారపక్షం అతిముఖ్యమంగా భావిస్తున్న ఐదు ముసాయిదా బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ, ఉద్యాన విశ్వ విద్యాలయ బిల్లు, గృహనిర్మాణ సంస్థ బిల్లు, పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులతోపాటు పర్యాటకులపై దాడులను నియంత్రించే ప్రత్యేక చట్టం కూడా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంది.

నీళ్లు – నియామకాలు:

నిధులు – నియామకాలే లక్ష్యంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో… ఆస్థాయిలో రిక్రూట్మెంట్లు జరిగిన దాఖలాలు లేవు. నిరుద్యోగుల్లో నిరాస రోజు రోజుకీ పెరిగిపోతున్న పరిస్థితి. దీనికి తోడు ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం ఒకటుంది. తెలంగాణలో పలు నీటిపారుదల ప్రాజెక్ట్ లపై ఏపీ అభ్యంతరాలు తెలుపుతున్న పరిస్థితుల్లో  .. హాట్ హాట్ చర్చలు జరిగే అవకాశం ఉంది!

డ్రగ్స్ – శాంతి భద్రతల సమస్యలు:

డ్రగ్స్ వ్యవహారానికి సంబందించి కేటీఆర్ పై విమర్శలు చేసే విషయంలో సిటీ సివిల్ కోర్టు రేవంత్ రెడ్డి నోటికి తాళం వేసినప్పటికీ.. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు కోరే అవకాశం పుష్కలంగా ఉంది.

దళితబంధు:

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో పుట్టిన దళిత బంధు పథకంపై తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ పథకం అమలుపై ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో.. ఇతరబంధులపై కూడా ప్రతిపక్షాలు – ప్రభుత్వాన్ని క్లారిటీకోరే అవకాశం ఉంది. కాబట్టి… ఈ అంశం కూడా ఈ సారి హాట్ టాపిక్కుల్లో ఒకటిగా మారనుంది.

కేసీఆర్ మూడు రోజులు ఢిల్లీ పర్యటన:

ఓవైపు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతుంటే, మరోవైపు సీఎం కేసీఆర్ మూడు రోజులు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఇందులో భాగంగా… కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే ఓ సదస్సు కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని చెబుతున్నారు. పైకి కేసీఆర్ ఇలా చెబుతున్నా… ఈ హస్తిన యాత్ర అసలు ఉద్దేశ్యం వేరే అని కాంగ్రెస్ విరుచుకుపడుతుంది.

ఈ అన్ని అంశాల నడుమ… తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగే అవకాశం పుష్కలంగా ఉంది.

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news