TRS TO BRS : పార్టీ పేరు మార్పుపై ఈసీకి కేసీఆర్ లేఖ

-

టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై తెరాస ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారింది.

రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశాక.. మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. దీంతో 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది.

టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేర‌కు టీఆర్ఎస్ పార్టీ ఈసీకి లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త్ రాష్ట్ర స‌మితిగా మారుస్తూ తీర్మానం చేసిన‌ట్లుగా అందులో పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగం సవరించినట్లు కేసీఆర్ ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news