మార్పు కోసం ముందడుగు వేసిన సమాజాలే అభివృద్ధి సాధించాయి : కేసీఆర్

-

భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా పార్టీ సర్వసభ్య సమావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండు ముఖ్యమైన వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. అందులో ఒక‌టి లింగ వివక్ష, రెండోది కుల వివక్ష అని చెప్పారు.

లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం జనాభా అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడం వల్ల నష్టం జరుగుతోందని అన్నారు.  దేశ జనాభాలో 20 శాతం దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నార‌ని పేర్కొన్నారు. అటు మహిళా శక్తి, ఇటు దళిత శక్తి నిర్వీర్యం కావడం వ‌ల్ల అభివృద్ధి జరగట్లేద‌ని కేసీఆర్ వాపోయారు.

పేదరికం పేరుతో అగ్రవర్ణాల వారిలో కూడా ఎందరో అవకాశాలను కోల్పోతున్నార‌ని కేసీఆర్ అన్నారు. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదని తెలిపారు. స్థూలమైన విషయాల్లో మౌలిక మైన మార్పు రాకుండా సామాజిక పరిస్థితుల్లో మార్పు రావడం సాధ్యం కాదన్నారు.

ఏ దేశాలైతే.. ఏ సమూహాలైతే.. తాము నిత్యం అనుసరిస్తున్న సాధారణ పని విధానం నుంచి బయటపడతాయో ఆ సమాజాన్ని వినూత్న పంథాలో నడిపిస్తాయో, అటువంటి దేశాలే గుణాత్మకంగా మారాయని కేసీఆర్ గుర్తుచేశారు. మార్పు కోరుకోని సమాజాలు మారలేదని  చెప్పారు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచిన సమాజాలే ఫలితాలు సాధించాయ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news