తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి అడ్డాగా మారిందని బీఎస్సీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సూర్యపేట్ జిల్లాలోని గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్రలో బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ముంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా.. డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మాత్రమే కాకుండా.. యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ రెండేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని అన్నారు. కష్టాలు రెట్టింపు అయ్యాయని మండిపడ్డారు. మిల్లర్లతో కుమ్మక్కు అయి.. తెలంగాణ రైతులకు మద్దతు ధర అందకుండా.. చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అక్రమాలను, అవినీతిని ఎప్పటికప్పుడు.. ప్రశ్నిస్తానని తెలిపారు.