జాతీయ పార్టీ పేరు మర్చిపోయిన మంత్రి.. BRS బదులు BSP అని..

-

కొన్నేళ్ల పాటు ఉన్న అలవాటు ఒక్కసారిగా మారాలంటే ఎవరికైనా కష్టమే. దీనికి ప్రజాప్రతినిధులు అతీతులేం కాదు. ఇలాంటి సంఘటనే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎదురైంది. ఇన్నేళ్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో మంత్రి బీఆర్ఎస్ పార్టీ పేరును పలకబోయి.. తప్పులో కాలేశారు.

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం రోజున దసరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ  సందర్భంలో ఏకంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ కొత్త పేరునే మర్చిపోయారు. బీఆర్ఎస్ కు బదులుగా బీఎస్పీ అనేశారు. వరంగల్ లోని ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో ఈ సంఘటన జరిగింది.

ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఓ సందర్భంలో కొత్తగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ అని మర్చిపోయారు. అది ఏంటని జనాల్ని అడిగారు. అక్కడున్న వారు బీఎస్పీ అనడంతో.. అదే ఫ్లోలో మంత్రి కూడా బీఎస్పీ అని అనేశారు.

Read more RELATED
Recommended to you

Latest news