తెలంగాణలో ధాన్యం సేకరణపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన

-

ధాన్యం కొనుగోలు అంశంపై మాటల మంటలు చెలరేగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలకు ధాన్యం కొనుగోలు వ్యవహారం ఆజ్యం పోసింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఇటు లోక్ సభ, అటు రాజ్యసభలో ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పార్లమెంట్

తాజాగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 2020-21 రబీ సీజన్ లో తెలంగాణ నుంచి 55 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని టార్గెట్ పెట్టుకుంటే 61.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కేంద్రం తెలిపింది. మిగుల బియ్యం తీసుకోవాలని తెలంగాణ కోరడంతో టార్గెట్ కు మించి తీసుకున్నామని కేంద్ర వెల్లడించింది. తెలంగాణలో ఈ ఖరీఫ్ లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆగస్టు 17న జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలపింది. యాసంగి సీజన్ మొదలయ్యాకే టార్గెట్ నిర్ణయిస్తామని వెల్లడించింది. దిగుబడి అంచనా.. మార్కెట్ మిగులు, సాగు అంచనాల గణాంకాలతో ఎంత పెంచాలనేది నిర్ణయిస్తామని కీలక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news