టీడీపీలో టెన్షన్ టెన్షన్.. తొలి జాబితా అభ్యర్థుల మార్పు..!

-

ఏపీ రాజకీయాలు ఇలా మారుతాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. అధికార పార్టీ టీడీపీ నుంచి వైసీపీలోకి నాయకులు క్యూ కడతారని ఎవ్వరూ ఊహించలేదు. అసలు.. ఏపీ రాజకీయాలు ఇంత రసవత్తరంగా మారుతాయని ఆ దేవుడు కూడా ఊహించి ఉండడు…

అయ్య బాబోయ్.. ఇవి మామూలు ఎన్నికలు కాదు. ఏపీలో ఎన్నికలు మాత్రం అధికార టీడీపీ కొంప ముంచేలా ఉన్నాయి. వార్ వన్ సైడే అన్నట్టుగా వైసీపీ వైపు ఏపీ ప్రజలంతా మొగ్గడం… దీంతో కొంతమంది టీడీపీ అభ్యర్థులు ఓడిపోవడం కన్నా పోటీ చేయడమే బెటర్ అనుకొని తప్పుకోవడం టీడీపీకి మింగుడు పడటం లేదు. అందుకే తొలి జాబితాలోని పేర్లు తారుమారవుతున్నాయి.

tension in tdp first list candidates may be changed

తొలి జాబితాలోని కొంతమందిని మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారట. కొందరికి వేరే చోట అవకాశం కల్పించడం… లేదంటే లోక్ సభ సీటు ఇవ్వడం లాంటి అంశాలను ఆలోచిస్తున్నారట. 35 స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ఎంపిక చేయడం చంద్రబాబుకు తలనొప్పిని తీసుకొస్తున్నదట.



ముందుగా.. అసెంబ్లీ అభ్యర్థులను 126 మందిని ప్రకటించారు చంద్రబాబు. తర్వాత రెండో జాబితా పేరుతో మరో 15 మందిని ప్రకటించారు. 34 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. తొలి జాబితా ప్రకటించిన తర్వాత నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. దీంతో పెండింగ్ స్థానాలు కాస్త 35 కు చేరాయి.

ఈనేపథ్యంలో ముందు అసెంబ్లీ సీటు దక్కించుకున్న కలవపూడి శివను ఇప్పుడు నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నారు. మరోవైపు నర్సరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీ రాయపాటిని బరిలోకి దించాలని అనుకున్నా… ఆయన వయసు మీద పడుతుండటంతో.. నర్సరావుపేట లోక్ సభ స్థానాన్ని వేరేవాళ్లకు కేటాయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే నెల్లూరులోనూ అదే పరిస్థితి. మరోవైపు ప్రొద్దుటూరులోనూ పెండింగ్ లో ఉంది. శ్రీశైలం అభ్యర్థి వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రకటించిన జాబితాపై కూడా చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news