రైడ్స్‌తో టెన్షన్..కేసీఆర్ అలెర్ట్..నెక్స్ట్ టార్గెట్

-

తెలంగాణ రాజకీయాలని ఐటీ, ఈడీ రైడ్స్ కుదేపేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి రైడ్లు కొనసాగుతున్నాయి..అరెస్టులు జరుగుతున్నాయి. ఇక టీఆర్ఎస్‌కు చెందిన నేతల కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్ సంస్థలపై రైడ్స్ కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ, గంగుల వియ్యంకుడు వద్దిరాజు రవిచంద్ర నివాసాలు, సంస్థల్లో ఈడీ సోదాలు చేసింది.

ఇలా వరుసపెట్టి టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఇళ్ళలో, కంపెనీల్లో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ అలెర్ట్ అయ్యారు..రైడ్స్ జరిగిన అనంతరం గంగుల, వద్దిరాజుళని కేసీఆర్..ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ దాడులకు కౌంటర్‌గా ఏం చేయాలన్న దానిపై చర్చించారు. అలాగే వ్యాపార సంస్థల్లో డైరక్టర్లుగా ఉంటే బయటకు రావాలని గంగుల, వద్దిరాజులకు సూచించారు. బీజేపీపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలుగా విచారణకు హాజరైతే పార్టీకి ఇబ్బంది అని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

ఇప్పటికే నామా నాగేశ్వరరావుకు సంబంధించిన కొన్ని ఆస్తులని సి‌బి‌ఐ ఎటాచ్ చేసింది..ఇప్పుడు గంగుల, వద్దిరాజుల టార్గెట్ గా ఐటీ, ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని టీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నికలు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, అలాగే పార్టీ మారమని ఒత్తిళ్ళు కూడా వస్తాయని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్…పెద్ద నేతలకు సూచించినట్లు తెలిసింది.

ఇలా రైడ్స్ నేపథ్యంలో వ్యాపారాల్లో ఉన్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అలెర్ట్ అయ్యారు..డాక్యుమెంట్స్‌ని సేఫ్‌గా ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలిసింది..అలాగే ప్రభుత్వ క్వార్టర్ట్స్‌లో ఉండటం కూడా సేఫ్ కాదని భావించి..సేఫ్ గా ఉండే ప్రాంతాలకు తరలివేలుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఐటీ, ఈడీ రైడ్స్ టీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news