నేతల భవిత యువత చేతిలో

-

– మూడొంతులకుపైగా 20 నుంచి 49 సంవత్సరాల వయసువారు
– ఓటు హక్కు వినియోగించుకోనున్న 3 కోట్ల 26 లక్షల 2799 మంది ఓటర్లు

ప్రపంచంలోనే అత్యధిక మంది యువ శక్తిని కలిగిన దేశం భారత్. అన్నిరంగాల్లో యువత ముందుకెళుతోంది.ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతల భవితవ్యం యువ ఓటర్ల చేతిలోనే ఉంది.తెలంగాణ రాష్ట్రంలో 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసువారు కోటిన్నర కు పైగానే ఉన్నారు. వీరితో పాటు 20 నుంచి 49 ఏళ్ల వయసున్న వారు మూడొంతులకు పైగా ఉన్నారు. ఈ రెండింటినీ కలిపితే మొత్తంగా రెండు కోట్ల


24 లక్షల 25 వేల 817 మంది ఉన్నారు.ఇక మొదటిసారి ఓటుహక్కు పొందిన వారు 10 లక్షలకు పైగా ఉన్నారు. ఈసారి 3 కోట్ల 26 లక్షల 2799 మంది ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.అందులో పురుషులు కోటి 62 830లక్షల 98 వేల 418 మంది కాగా, మహిళలు కోటి 63 లక్షల 1705 మంది ఉన్నారు. ఇతరులు 2676 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయసున్న వారి సంఖ్య 9,99,667 మంది.మొదటిసారి ఎక్కువ మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.ఇక 20 నుంచి 29 సంవత్సరాల వయసున్న ఓటర్ల సంఖ్య 64 లక్షల 36 వేల 335 మంది.

రాష్ట్రంలోని ఓటర్లలో 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్నవారే అధికంగా ఉన్నారు.మొత్తం 3 కోట్ల 26 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా అందులో 30 నుంచి 39 ఏళ్ల మధ్యనున్నవారే 92 లక్షల 93 వేల 393మంది ఉన్నారు.40 నుంచి 49 సంవత్సరాల వయసున్న ఓటర్ల సంఖ్య 66 లక్షల 96 వేల 89 మందిగా నమోదైంది.ఈ రెండు వయసుల వారిని కలిపితే వారి సంఖ్య కోటిన్నర దాటుతుంది. మొత్తం ఓటర్లలో 30 నుంచి 49 ఏళ్ల వయసున్న ఓటర్లు కోటి 59 లక్షల 89 వేల 482 మంది ఉన్నారు.అంటే మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది 30 నుంచి 49 ఏళ్ల మధ్యన వయసున్న వారే ఉన్నారు.వారికి 20 నుంచి 29 ఏళ్ల వయసున్న వారిని కలిపితే ఆ సంఖ్య ఏకంగా 2 కోట్ల 24 లక్షల 25 వేల 817గా ఉంది.అంటే మూడో వంతు ఓటర్లు 20 నుంచి 49 మధ్య వయస్కులే అన్నమాట. అంటే ఓటు వేస్తున్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు.మరి ఈసారి స్పష్టమైన మార్పును కోరుతున్న యువత ఎవరి వైపు నిలుస్తారో చూడాలి.

ఇక 50 నుంచి 59 ఏళ్ల మధ్య 45 లక్షల 66 వేల 306 మంది,60 నుంచి 69 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 27 లక్షల 72 వేల 128 మంది ఉన్నారు. 70 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య 13 లక్షల 98 వేల 511 కాగా 80 ఏళ్ళు పైబడిన వారి సంఖ్య 4 లక్షల 40 వేల 361గా నమోదైంది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు.మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 76 నియజకవరగాల్లో మహిళ ఓటర్లే ఎక్కువ.33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో మహిళ ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version