రెండోసారి కూడా గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్..ఎప్పటికప్పుడు పార్టీ పరిస్తితులని, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పీకే టీం ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్తితిని, ఎమ్మెల్యేల పనితీరు, పథకాలు, ప్రత్యర్ధి పార్టీ టీడీపీ బలబలాల గురించి తెలుసుకుని జగన్‌కు సమాచారం అందిస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగా జగన్..తమ నాయకులకు, ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నారు.
తాజాగా జరిగిన వైసీపీ వర్క్ షాపులో కూడా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ గట్టిగానే క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే 27 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని, వీరు గడపగడపకు మన ప్రభుత్వాన్ని సరిగ్గా నిర్వహించడం లేదని క్లాస్ ఇచ్చారు. ఇకనైనా గడపగడపకు వెళ్లాలని సూచించారు. ఆ 27 మందిలో కొందరు మంత్రులు కూడా ఉన్న విషయం తెలిసిందే. సరే ఇది లీస్ట్‌లో ఉన్నవారి నెంబర్.
మరి టాప్‌లో ఎవరు ఉన్నారు..ఎవరు ఎక్కువగా గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారనే అంశం కూడా బయటకొచ్చింది. ఊహించని విధంగా నియోజకవర్గ ఇంచార్జ్‌లు టాప్‌లో ఉన్నారని తెలిసింది. ఫస్ట్ ప్లేస్‌లో పర్చూరు ఇంచార్జ్ రావి రామనాథం బాబు ఉన్నారు. ఈయన 110 రోజులు గడపగడపకు ప్రోగ్రాం చేశారట. 102 రోజులతో రెండోస్థానంలో పెద్దాపురం ఇంచార్జ్ దావులూరి దొరబాబు ఉండగా, మూడో స్థానంలో గోపాలాపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు ఉన్నారు.
ఇలా చూసుకుంటే టాప్ 20లో ఇంచార్జ్‌లే ఎక్కువ ఉన్నారని తెలిసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ఇంచార్జ్‌లు బాగా పనిచేస్తున్నారు కదా..మరి వారికి జగన్ సీటు ఇస్తారా? అంటే అది డౌట్ గానే ఉంది. ఉదాహరణకు పర్చూరు ఇంచార్జ్ రావి రామనాథం బాబు గురించి చెప్పుకుంటే..అక్కడ ఆయనకు ఖచ్చితంగా సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇక్కడ ఒక కాపు నేతకు సీటు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఏ ఇంచార్జ్‌కు ఎమ్మెల్యే సీటు దొరుకుతుందో.