ఎన్నికల వాయిదా వెనుక జరిగింది ఇదే…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను వాయిదా వేయడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీకి అనుకూలంగా ఉంది అని ఆరోపణలు ఎదుర్కొన్న ఎన్నికల సంఘం ఒక్కసారిగా ప్లేటు మార్చడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

అసలు దీని వెనుక ఏం జరిగింది అనేది ఒక్కసారి మీడియా సమాచారం ప్రకారం చూస్తే, శుక్రవారం కొందరు బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు పార్లమెంట్ భవన్లో వివరించారు. ఈ సందర్భంగా కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలను కొన్నింటిని బీజేపీ ఎంపీలు అమిత్ షా కు చూపించారు. వాటిని చూసిన అమిత్ షా పరిస్తితి మరింత మితి మీరితే తాము రంగంలోకి దిగుతానని చెప్పారని కొన్ని వార్తలు వచ్చాయి.

ఆయన అలా చెప్పారో లేదో మరుసటి రోజు అంటే శనివారం ఉదయం ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు జారీ చేసింది.ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రభుత్వం షాక్ అయింది. ఆ మరుసటి రోజే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి కారణం అమిత్ షా నా, లేక మరొక కారణం ఏమైనా ఉందా అనే దానిమీద స్పష్టత లేదు.

అయితే ఎన్నికల సంఘం చెప్పినట్టు ఎన్నికలు వాయిదా వేయడానికి కారణం కరోనా కాదని కొందరి అభిప్రాయం. ఏది ఎలా ఉన్నా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడటానికి కేంద్రం ప్రమేయం ఉండటం మాత్రం ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఇన్నాళ్లు తమకు సహకరించిన కేంద్రం ఇప్పుడు ఈ రకమైన పరిస్థితిని కల్పించడం పట్ల వైసీపీ నేతలు అసహనం తో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news