ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ నేటి వరకూ కూడా జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఎక్కడా జగన్ ని వేలెత్తి చూపేలా లేవు సరికదా అవినీతికి తావులేకుండా ఉండటంతో విమర్శకులు సైతం జగన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. రాజధాని మార్పుపై కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజధానిని అమరావతిలో కాకుండా తుళ్ళూరు లో నిర్మిస్తే మంచిదనే నిర్ణయానికి జగన్ వచ్చారనేది ప్రస్తుతం వైసీపీ ఇన్నర్ వర్గాలలో నడుస్తున్న చర్చ..
రాజధానిని తుళ్ళూరు లో గనుకా నిర్మించాలని అనుకుంటే అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలని యధావిధిగా కొనసాగించి భవిష్యత్తులో ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకుండా తుళ్ళూరులో నిర్మించాలని జగన్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. తుళ్ళూరు ప్రాంత శివారుల్లో శాశ్వత అసెంబ్లీ , సచివాలయం, హైకోర్ట్ ,వంటి కీలక నిర్మాణాలు చేపట్టాలని జగన్ భావిస్తున్నారట. అయితే అమరావతిలో ఈ కీలక నిర్మాణాలు చేపట్టకపోవడం వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై కూడా జగన్ వద్ద క్లారిటీ ఉందని తెలుస్తోంది.
రాజధాని విషయంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన జగన్ నిపుణుల సలహా మేరకే రాజధాని ప్రాంతాన్ని మార్చనునట్టుగా తెలుస్తోంది. తుళ్ళూరు లో భవన నిర్మాణాలకి అయ్యే ఖర్చు కంటే లింగంపల్లి, నీరుకొండ ప్రాంతాలలో ఈ ఖర్చు రెండింతలు అధికంగా ఉంటుందట. అంతేకాదు అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా ఉందని, పైగా కొండవీటి వాగు పొంగితే చుట్టుపక్కల ఊళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని అందుకే జగన్ కొత్త రాజధాని నిర్మించడానికి తుళ్ళూరు మండలంలోని శివారు ప్రాంతాలని ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక వేళ ఇదే నిజమయితే అతి త్వరలోనే రాజధాని మార్పు ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.