హుజూరాబాద్ రాజ‌కీయాల్లోకి ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌రావు ఎంట్రీ

-

హుజూరాబాద్ రాజ‌కీయాలు మ‌రింత వేగాన్ని అందుకుంటున్నాయి. వేగ‌వంతంగా రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి గంగుల మాత్ర‌మే టీఆర్ ఎస్ నుంచి ఉండ‌గా.. ఇప్పుడు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న మంత్రి హ‌రీశ్ రావును అధిష్టానం రంగంలోకి దింపింది.

 

వ్యూహాలు ప‌న్న‌డంలో, విజ‌యాలు సాధించ‌డంలో దిట్ట‌గా పేరున్న హ‌రీశ్‌కు హుజూరాబాద్ రాజ‌కీయాల బాధ్య‌త అప్ప‌గించింది. ఈయ‌న‌తో పాటు బోయిన్‌ప‌ల్లి వినోద్‌కుమార్ కూడా ఉంటారు.

హ‌రీశ్‌రావు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో గంగుల‌, వినోద్‌కుమార్ పర్య‌వేక్ష‌ణ‌లో టీఆర్ ఎస్ కేడ‌ర్‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈట‌ల వైపు ఉన్న కొంత‌మంది నాయ‌కుల‌తో ర‌హ‌స్య మంత‌నాలు జ‌ర‌పుతున్నారు. పూర్తి స్థాయిలో కేడ‌ర్‌ను మ‌లుపుకొని రాబోయే ఉప ఎన్నిక‌లో గెలిచేవిధంగా హ‌రీశ్‌రావు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. మ‌రి ఈట‌ల‌కు అత్యంత స‌న్నిహితుడైన హ‌రీశ్‌రావు పార్టీ ఆదేశాల‌ను అమ‌లు చేస్తారా లేక ఈట‌ల‌కు ఇన్ డైరెక్ట్‌గా స‌పోర్టు చేస్తారా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news