తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి షర్మిల..వైఎస్సార్టీపీ పెట్టి ఏడాది అయిపోయింది. షర్మిల పార్టీ పెట్టే సమయంలో…ఆ పార్టీ గురించి హైప్ ఎక్కువ వచ్చింది…అసలు ఇంకేముంది…తెలంగాణలో షర్మిల పార్టీ ఓ బలమైన శక్తిగా ఉంటుందని, అలాగే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలు షర్మిల పార్టీలోకి వచ్చేస్తారని ప్రచారం జరిగింది.
కానీ నెల రోజుల్లోనే షర్మిల పార్టీ తుస్సుమంది..ఆ పార్టీలోకి వెళ్ళేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు..పైగా అందులోకి వెళ్ళిన కొందరు నేతలు మళ్ళీ తిరిగొచ్చేశారు. అసలు ఏడాది కాలంలో షర్మిల పార్టీలో పురోగతి లేదు. ఇంకా చెప్పాలంటే ఆమెని పెద్దగా పట్టించుకోవడం లేదు. కాకపోతే ఏదొకవిధంగా షర్మిల పార్టీ వార్తల్లో ఉంటుంది…అలాగే ఆమె పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు..అదేవిధంగా నిత్యం ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు..అలాగే టీఆర్ఎస్ మంత్రులపై కూడా ఆమె గళం విప్పుతున్నారు. కానీ షర్మిల…తీవ్ర స్థాయిలో తిడుతున్న సరే టీఆర్ఎస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు… అసలు ఆమెకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఏదో మొదట్లో కాస్త స్పందించారు గాని..ఆ తర్వాత నుంచి పట్టించుకోలేదు. అంటే తెలంగాణ రాజకీయాలపై షర్మిల ప్రభావం పెద్దగా లేదని వదిలేశారా? లేక ఆమె ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలిస్తే తమకే లాభమని పట్టించుకోవడం లేదా? అది కాదంటే తాము ఆడించే పోలిటికల్ గేమ్ లో షర్మిల పావుగా ఉన్నారని, లేక తమ కోసమే పనిచేస్తుందని స్పందించడం లేదా? అనుమానాలు, గుసగుసలు కూడా వినిపించాయి.
అయితే నిన్న షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రజాప్రస్థానంలో వైఎస్ఆర్ టీపీ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు దాడి చేయడం విస్మయం కలిగించింది. విమర్శలు ప్రతి విమర్శలు అనేవి రాజకీయంలో హర్షించదగ్గవిగా ఉంటాయి కానీ బౌతిక దాడులు మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు. అంటే టీఆర్ఎస్‌లో భయం మొదలైందని అందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు అంటున్నారు. వైఎస్ఆర్ టీపీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై కొంత మంది దాడికి ప్రయత్నించారు.
కారణాలు ఏవైనా గాని షర్మిల చేస్తున్న విమర్శలకు టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తే మంచిదే కానీ ఇలా భౌతిక దాడులు చెయ్యడం సమంజసం కాదంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం ఖాయం. అయితే రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు.. రేపు షర్మిల వల్ల రాజకీయం నష్టం జరిగినా జరగొచ్చు…