వచ్చే నెలలో గులాబీ పార్టీ భారీ సభ.. కాంగ్రెస్, బీజేపీకి కౌంటర్..?

-

తెలంగాణలో రాజకీయం బాగా హీటెక్కింది. శుక్రవారం రెండు జాతీయ పార్టీలు ఒకేసారి అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ భారీ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సభా వేదిక నుంచి కేసీఆర్, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ నేతలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ అటాక్‌గా టీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల భారీ సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పింక్ పార్టీ భారీ స్థాయిలోనే ప్లీనరీ నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఆ సభను వచ్చే నెలలో నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే కాంగ్రెస్, బీజేపీ నిర్వహించిన సభలపై టీఆర్ఎస్ నేతలు విశ్లేషణ చేస్తున్నారట.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ఈ రెండు సభలకు జనాల తరలింపు ఎలా జరిగింది, ఎంత మంది హాజరయ్యారనే వివరాలను సీఎం ఇంటెలిజెన్స్ వర్గాలను ఆరా తీసినట్లు సమాచారం. గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ సక్సెస్ అవడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయమై చర్చించుకుంటున్నాయి. గజ్వేల్ సభపై పూర్తి స్థాయి నివేదికను సీఎం కేసీఆర్‌కు త్వరలో అందించనున్నారు. ఈ క్రమంలోనే నిర్మల్ సభకు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎంత మంది హాజరయ్యారు అనే వివరాలను కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. మొత్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీని ఒకే టైంలో రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ చేయడం ద్వారా సీఎం కేసీఆర్ అలర్ట్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. కాగా, వచ్చే నెలలో భారీ ప్లీనరీ సభ నిర్వహించి ఆ వేదిక ద్వారానే సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీకి కౌంటర్ ఇస్తారో లేదో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news