హుజూరాబాద్‌లో పంప‌కాలు షురూ చేసిన బీజేపీ.. భ‌గ్గుమంటున్న టీఆర్ఎస్‌..!

రోజురోజుకూ హుజూరాబాద్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠకు దారితీస్తూ అన్ని పార్టీల‌ను టెన్ష‌న్ పెడుతోంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఏ నాయ‌కుడు ఎటువైపు మ‌ద్ద‌తు ఇస్తాడో అంటూ అంద‌రూ నిత్యం కంగారు ప‌డుతున్నారు. ఇక ఇప్ప‌టికే ఎన్నో ప‌రిణామాలు, ఎన్నో మ‌లుపులు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఈట‌ల రాజేంద‌రే గెలుస్తాడంటూ ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతున్నా కూడా ఆయ‌న లైట్ తీసుకోకుండా చాలా తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు.

bjp-trs
bjp-trs

 

త‌న‌కు నియోజకవర్గంలో ఎంతో ప‌ట్టు ఉన్నా కూడా త‌న‌ను ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుల‌ను త‌ట్టుకునేందుకు చివ‌ర‌కు ఈటల రాజేంద‌ర్ పంప‌కాల‌ను కూడా షురూ చేశారు. నోటిఫికేషన్ రాకున్నా కూడా త‌న వైపు తిప్పుకునేందుకు ఇప్పుడు పంప‌కాల‌ను కూడా షురూ చేశారు.

ఇందులో భాగంగానే ఆయ‌న సతీమణి జమున ప్రజలను కలుస్తూ తాయిలాలు కూడా పంచుతుండడం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంద‌ని తెలుస్తోంది. ఇక దాదాపు రెండు రోజులుగా ముగ్గురు యువకులు ఆయా గ్రామాల్లో తిరుగుతూ గోడగడియారాలను పంచుతున్న వీడియోలు కాస్త సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. తాయిలాలు పంచుతూ ఈట‌ల అవినీత‌కి పాల్ప‌డుతున్నారంటూ భ‌గ్గుమంటున్నారు. మ‌రి ఈట‌ల పెట్టుకున్న న‌మ్మ‌కం నిల‌బ‌డుతుందా లేదా అన్న‌ది చూడాలి.