అనూహ్యంగా వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలను టీఆర్ఎస్ అధిష్టానం ఎంత సీరియస్గా తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే కేవలం ఒక్క ఉప ఎన్నిక కోసమే ఎన్నో స్కీములను పెడుతోంది. ఏకంగా దళిత బంధులాంటి పెద్ద స్కీమునే పెట్టడానికి రెడీ అయిందంటే కేసీఆర్‌కు ఈ ఎన్నిక ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ఇక ఇన్ని చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు మరో ఎత్తుగడకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే మేజర్ ఓటు బ్యాంకు ఉన్న దళితుల కోసం ఏకంగా లక్ష కోట్లతో దళితబంధు స్కీమ్‌ణు రెడీ చేసిన కేసీఆర్ వారిని ఆకట్టుకునేందుకు కొప్పుల ఈశ్వర్‌ను రంగంలోకి దించారు. అలాగే గిరిజనుల ఓట్ల కోసం మంత్రి సత్యవతి రాథోడ్‌ను,కల్లు గీత కార్మికుల ఓట్లను ఆకర్షించేందుకు శ్రీనివాస్ గౌడ్‌ను, ఇక బలమైన సామాజిక వర్గమైన రెడ్డి, కమ్మ సామాజిక వర్గం మెప్పుకోసం ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వారిని దించింది టీఆర్ఎస్ అధిష్టానం.
ఇక ఇప్పడు మరో బలమైన సామాజిక వర్గమైన యాదవుల కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దింపుతోంది.ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీని కేవలం హుజూరాబాద్‌లోనే ప్రారంభిస్తోంది. రేపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు మంత్రులతో ఎత్తుగడ వేస్తున్నారు. మరి గులాబీ దళపతి ప్లాన్లు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.