కమలం ఆపరేషన్ షురూ..ఆట మొదలుపెట్టారా?

-

మళ్ళీ బి‌జే‌పిని రేసులోకి తీసుకురావడానికి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా? అందుకే ఎప్పుడు లేని విధంగా ఆయన దూకుడు ప్రదరిస్తున్నారా? అంటే ప్రస్తుతం బి‌జే‌పి రాజకీయం చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో బాగా దూకుడుగా పనిచేసి బి‌జే‌పిని రేసులోకి తీసుకొచ్చారు. కానీ ఆయన్ని తప్పించి కిషన్ రెడ్డిని నియమించడంతో ఇంకా బి‌జే‌పి పడిపోతుందని విమర్శలు వచ్చాయి.

ఎందుకంటే కిషన్ రెడ్డి సౌమ్యంగా ఉంటారు..ఎటాకింగ్ పాలిటిక్స్ చేయరు. కానీ దానికి విరుద్ధంగా కిషన్ రెడ్డి ముందుకెళుతున్నారు. కే‌సిఆర్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అలాగే పార్టీని బలోపేతం చేసే విషయంలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా వెళుతున్నారు. పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా జిట్టా బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. అలాగే బి‌జే‌పిలో చేరికలు పెద్దగా జరగడం లేదు..దీనిని కూడా కిషన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. త్వరలోనే కీలక నేతలనీ పార్టీ లో చేర్చుకునే దిశగా ఆయన పనిచేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. వారిని బి‌జే‌పిలోకి తీసుకొస్తున్నారు. త్వరలోనే వారిని ఢిల్లీకి తీసుకెళ్లి జే‌పి నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పిస్తారని తెలిసింది.

అటు మాజీ డి‌సి‌సి‌బి ఛైర్మన్‌లు లక్ష్మారెడ్డి, జైపాల్ రెడ్డి సైతం బి‌జే‌పిలో చేరనున్నారని తెలిసింది. ఇలా చేరికల విషయంలో స్పీడ్ పెంచి..ఇంకా బి‌జే‌పిని రేసులోకి తీసుకురావడమే లక్ష్యంగా కిషన్ రెడ్డి ముందుకెళ్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news