టీటీడీపీ నయా స్కెచ్..ఖమ్మంలో స్టార్ట్..!

-

తెలంగాణలో కనుమరుగయ్యే స్థితి నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తనదైన శైలిలో రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతకముందు ఉన్న ఎల్ రమణ గాని, తర్వాత బక్కని నరసింహులు గాని క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేయలేదు. ఏదో పేరుకు అధ్యక్షులుగా మాత్రమే ఉన్నారు.

రమణ వెళ్లిపోయాక టీడీపీ ఇంకా అయిపోయినట్లే అని అనుకున్నారు. బక్కని నరసింహులు అని అధ్యక్షుడుగా పెట్టి అలా అలా బండి లాగించారు. కానీ ఇప్పుడు కాసాని టీడీపీలో చేరడం, అధ్యక్షుడు కూడా అవ్వడంతో పార్టీకి కాస్త ఊపు కనబడుతోంది. అటు కింది స్థాయి కార్యకర్తలు సైతం సరైన నాయకత్వం లేక సైలెంట్ గా ఉండటం ఎన్నికల సమయంలో నచ్చిన పార్టీకి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు అధ్యక్షుడు యాక్టివ్ గా పనిచేయడంతో క్యాడర్ కూడా యాక్టివ్ అవుతుంది.

ఇదే సమయంలో ఎప్పటికప్పుడు పార్టీ సమావేశాలు పెట్టడం, ఇతర పార్టీల నేతలని టీడీపీలో చేర్చుకోవడం చేస్తున్నారు. అలాగే ఖాళీలు ఉన్న పదవులని భరిటీ చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఇంచార్జ్‌ల్ని పెడుతున్నారు. ఇక ఈ నెల 26వ తేదీన ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చంద్రబాబు వస్తున్నారు..అలాగే అక్కడ భారీ సభ పెట్టనున్నారు. ఎలాగో ఖమ్మం అంటే టీడీపీ కంచుకోటగా ఉండేది..ఇప్పుడు భారీ సభ పెట్టి సక్సెస్ చేసి..తెలంగాణలో మళ్ళీ టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయనే సంకేతాలు ఇవ్వాలని చూస్తున్నారు.

అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి కాసాని ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా సింగరేణి ఎన్నికల్లో టి‌ఎన్‌టి‌యూ‌సిని బరిలోకి దింపుతున్నారు. మొత్తానికి టీటీడీపీకి కొత్త ఊపు తీసుకొచ్చేలా కాసాని ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news