ఆంధ్ర టిడిపిలో అలజడి.. కొత్త దారి వెతుక్కుంటున్న తెలుగు తమ్ముళ్ళు

-

ఆంధ్రప్రదేశ్​ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ తన మార్కును చూపెట్టలేదు. అసలు పార్టీ ఇప్పట్లో కోలుకుంటుందో లేదో అన్న బెంగ తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారంతా తలో దారి చూసుకుంటున్నట్లు సమాచారం.

 

ఇప్పటికే పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడంతో తమ్ముళ్లు పునరాలోచలో పడ్డారు. ఇక టీడీపీలో ఉంటే లాభం లేదని నిర్ణయించుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార వైసీపీ ఫుల్లుగా నిండి ఉండడంతో వారు మరో గత్యంతరం లేక బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. బీజేపీలో చేరిన మూడేళ్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది కనుక భవిష్యత్​ కు ఢోకా ఉండదని వారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పరిస్థితి కూడా ఏపీలో అంతలా దూకుడు మీద ఏం లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉండడం, మరలా వైసీపీతో అన్యోన్యంగా ఉండడంతో ఏదో ఒక పదవి తప్పక వస్తుందని, అంతే కాకుండా కేంద్ర పథకాల ద్వారా కూడా జనాలకు దగ్గర కావచ్చని చూస్తున్నారట. ఇలా తమ్ముళ్లు తలో దారి చూసుకోవడానికి చంద్రబాబు పుత్రుడు లోకేశ్ బాబు కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఆయన చలాకీగా లేకపోవడం వల్లే తాము ఇలా పక్క పార్టీలకు వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తమ్ముళ్లు వాపోతున్నారు. మరలా సాధారణ ఎన్నికలు వచ్చేంత వరకు ఎదురుచూడడం వేస్ట్ అన్న ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ వల్ల ఇన్నాళ్లు పదవులు అనుభవించిన వారే పార్టీ మారేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news