సీబీఐ వర్సెస్ కవిత : గేమ్‌లో ట్విస్ట్..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో పలువురు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకొచ్చాయి. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వచ్చింది. పైగా ఈడీ రిపోర్టులో కూడా కవిత పేరు నమోదైంది. దీంతో సీబీఐ కవితకు నోటీసులు కూడా జారీ చేసింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి విచారణ చేయాలని..డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లేదా ఢిల్లీలో విచారణ చేస్తామని నోటీసులు ఇచ్చింది.

దీనికి కవిత కూడా సమాధానం ఇస్తూ..హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద విచారణ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. దాని ప్రకారం మంగళవారం సి‌బి‌ఐ విచారణ జరగాలి. కానీ కవిత మాత్రం జగిత్యాల కేసీఆర్ సభ ఉందనే కారణంతో సి‌బి‌ఐ విచారణకు హాజరు కాలేనని చెప్పేశారు. సభ ఏర్పాట్లు చూసుకునే క్రమంలో జగిత్యాలకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక ఈ నెల 11,12,14,15 తేదీల్లో విచారణకు హాజరవుతానని వెల్లడించారు. కానీ కవిత లేఖకు సీబీఐ అధికారులు రిప్లై ఇవ్వలేదు. సీబీఐ నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సమయం ప్రకరమైతే ఈ రోజు ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు విచారణకు హజరవ్వాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. మరి కవిత ఏమో అందుబాటులో ఉండేలా లేరు. అంటే ఇదంతా యాదృచ్చికంగా జరిగిందా? లేక సి‌బి‌ఐ విచారణ వాయిదా వేసే ప్లాన్ ఏమైనా జరుగుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే సి‌బి‌ఐ నోటీసులపై ఇప్పటికే కవిత..కేసీఆర్‌ సమావేశమయ్యారు. మళ్ళీ సోమవారం కూడా అదే అంశంపై సమావేశం అయినట్లు తెలిసింది. తీర సి‌బి‌ఐ విచారణ సమయానికి వచ్చేసరికి కవిత..సీఎం సభ ఏర్పాట్లు చూడాలని చెబుతూ..జగిత్యాలకు వెళుతున్నారు. అటు ఏమో సి‌బి‌ఐ అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. మరి ఈ పరిస్తితుల నేపథ్యంలో సి‌బి‌ఐ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news