బీజేపీలో ట్విస్ట్‌లు..బాబు బ్యాచ్ లీడింగ్?

-

దేశంలో అన్నీ రాష్ట్రాల్లో బీజేపీ ఒక దారి అయితే…ఏపీలో బీజేపీది ఒక దారి అని చెప్పొచ్చు. రాష్ట్రంలో బీజేపీకి మంచిగా బలం పెంచుకునే అవకాశాలు ఉన్నా సరే…ఆ అవకాశాలని ఉపయోగించుకోలేని స్థితిలో బీజేపీ ఉంది. పైగా బీజేపీలో వైసీపీ గ్రూపు అని, టీడీపీ గ్రూప్ అని ఉన్నాయి. అంటే బీజేపీలో కొందరు నేతలు వైసీపీకి అనుకూలంగా ఉంటారు…మరికొందరు నేతలు టీడీపీకి అనుకూలంగా ఉంటారు. ఇలా ఎప్పటినుంచే బీజేపీలో రాజకీయం నడుస్తోంది. పైగా కేంద్రం కూడా ఏపీకి అనుకున్న మేర సాయం చేయదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రజలు బీజేపీని ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు.

పైగా ఇప్పుడు బీజేపీలో చంద్రబాబు బ్యాచ్ హవా ఎక్కువైంది. గత ఎన్నికల తర్వాత చాలామంది టీడీపీ నేతలు బీజేపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారే బీజేపీలో రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో కాస్త ఈ బ్యాచ్‌ని సోము వీర్రాజు తొక్కడానికి చూశారు. వీర్రాజుకు జీవీఎల్, సునీల్ దేవధర్ లాంటి నాయకుల మద్ధతు దొరికింది. కాకపోతే వీరేమో జగన్‌కు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం వచ్చింది.

దీంతో బాబు బ్యాచ్‌కు మంచి అవకాశం దొరికింది. అలా జగన్‌కు సపోర్ట్ చేయడం వల్లే బీజేపీ ఎడగలేదనే విషయాన్ని అధిష్టానం వరకు తీసుకెళ్లారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో వీర్రాజు అధికారాలకు కోత పడింది. పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా…ఒక కోర్ కమిటీని వేసి ఆ కమిటీ తుది నిర్ణయానికే కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఆ కమిటీలో సోము వీర్రాజు, సునీల్ దేవధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీ నారాయణ, పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరీ, టీజీ వెంకటేష్‌లని సభ్యులుగా చేర్చింది.

అయితే ఇందులో బాబు బ్యాచ్‌దే లీడింగ్..దీంతో బీజేపీ బాబు బ్యాచ్ చేతుల్లోకి వెళ్ళిపోయినట్లు కనిపిస్తోంది. ఇక వారే టీడీపీతో పొత్తు కూడా ఫిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి బీజేపీని బాబు బ్యాచ్ ఏలుతుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news