మరోసారి బరి తెగించిన ట్విట్టర్‌.. ప్రత్యేక దేశంగా జమ్మూ కశ్మీర్‌

-

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ బరి తెగించింది. ఈ సారి ఏకంగా భారత దేశ భూభాగమైన జమ్మూ కశ్మీర్‌ ను ప్రత్యేక దేశంగా చూపింది ట్విట్టర్‌. లద్దాఖ్‌ ను కూడా చైనాలో అంతర్భాగంగా చూపింది. గతంలోనూ లద్దాఖ్‌ను చైనాలో అంతర్భాగమని చూపించిన ట్విట్టర్‌.. తాజాగా మరోసారి తన దుర్భుద్దిని ప్రదర్శించింది. అయితే.. ట్విట్టర్‌ తాజా నిర్వాహంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది.

కాగా.. ఇటీవలే.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతాను యూఎస్‌ఎ డిజిటల్‌ కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లగించారనే ఆరోపణలతో గతవారం దాదాపు గంటపాటు తన ఖాతాను బ్లాక్‌ చేసింది ట్విట్టర్‌. మళ్లీ గంట తర్వాత తన ఖాతాను అన్‌ బ్లాక్‌ చేసినట్లు.. రవి శంకర్‌ ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్‌ చర్యలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2021 రూల్‌ 4(8) నియమాలను ఉల్లగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఖాతాను నిలిపివేసే.. సమయంలో నోటీసులు కూడా ఇవ్వలేదని ట్విట్టర్‌ పై ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news