తేల్చుకోలేని పవన్..బీజేపీతో డ్యామేజ్..!

-

ఏపీలో పొత్తుల అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది..దాదాపు టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని అంతా అనుకుంటున్న నేపథ్యంలో బీజేపీ బాంబ్ పేల్చింది..టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని, బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని జి‌వి‌ఎల్ నరసింహారావు లాంటి వారు అంటున్నారు. మొదట పవన్‌తో చంద్రబాబు భేటీ అయినప్పుడు..టీడీపీ-జనసేన పొత్తు ఉండవచ్చని అంతా అనుకున్నారు. కానీ మోదీ-పవన్ భేటితో సీన్ మారిపోయింది. ఆ తర్వాత పవన్ సైలెంట్ గా ఉండటంతో పొత్తులపై కన్ఫ్యూజన్ వచ్చింది.

ఇదే క్రమంలో కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది..పైగా పొత్తుపై క్లారిటీ లేదు. దీంతో చంద్రబాబు..తమ పార్టీ నాయకులకు సింగిల్ గానే ఎన్నికలకు వెళ్ళేలా దిశానిర్దేశం చేయాలని చూస్తున్నారు. తర్వాత పొత్తుకు ముందుకొస్తే ఓకే లేదంటే ఒంటరిగానే తేల్చుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు తేల్చాల్సింది పవన్ మాత్రమే..వైసీపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న పవన్ గాని..కేవలం బీజేపీతో కలిసి వెళితే..పెద్ద డ్యామేజ్ తప్పదు.

వాస్తవానికి జనసేన ఓటు బ్యాంక్ కాస్త పెరిగింది..గత ఎన్నికల్లో 6 శాతం వస్తే..ఇప్పుడు 9-10 శాతం వరకు వచ్చింది..అటు బీజేపీకి ఇంకా 1 శాతం లోపే ఉంది. దీని వల్ల బీజేపీ-జనసేనకు అధికారం రాదు..అలా అని పది సీట్లు గెలుచుకున్న ఎక్కువే. పైగా ఎక్కువగా టీడీపీ ఓట్లు చీల్చి మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడానికి ప్లస్ అవుతారు. కానీ వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్ అంటున్నారు. మరి అలాంటప్పుడు బీజేపీ కలిసి వస్తే ఓకే లేదంటే..టీడీపీతో కలిసి పోటీ చేయడమే.

దీని వల్ల అటు టీడీపీకి, ఇటు జనసేనకు లాభమే..పైగా వైసీపీని నిలువరించవచ్చు. అలా కాకుండా బీజేపీ మాటల మీద ఉండిపోతే జనసేనకు పావలా ఉపయోగం లేదు. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, ఆ తర్వాత టీడీపీని దెబ్బకొట్టి బలం పెంచుకోవచ్చని పవన్‌కు బీజేపీ చెప్పిన ప్రయోజనం లేదు. ముందున్న ఎన్నికలు వదిలేసి ఆ తర్వాత పరిస్తితి గురించి ఆలోచించడం వేస్ట్..ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలియదు కాబట్టి ఏదైనా పవన్ ఇప్పుడే తేల్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news