ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బాబు… ఎన్టీఆర్ అడ్డాలో సడన్ చేంజ్?

-

ఈ మధ్య టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. టి‌డి‌పి బలోపేతం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడటం లేదు. ఇక పనిచేయని నేతలని పక్కనబెట్టకపోతే పార్టీ పరిస్తితి దిగజారిపోతుందని చంద్రబాబుకు బాగా అర్ధమైనట్లు కనిపిస్తోంది….అందుకే చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కూడా చంద్రబాబు ఊహించని ట్విస్ట్ ఒకటి ఇచ్చారు.

chandrababu naiduపార్టీలో పని చేయని నాయకులని పక్కనబెట్టేసి….కొత్తవారికి ఇంచార్జ్‌లుగా అవకాశం కల్పించారు. అసలు ఊహించని విధంగా సీనియర్ నేతలని సైడ్ చేసేశారు. సాలూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న భాంజ్ దేవ్‌ను తప్పించి, గుమ్మడి సంధ్యారాణిని ఇంచార్జ్‌గా పెట్టారు. అటు మాడుగులలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని సైడ్ చేసి, ఇంచార్జ్‌గా పీవీజీ కుమార్‌కు బాధ్యతలు ఇచ్చారు.

అలాగే పామర్రులో ఉప్పులేటి కల్పనను పక్కన పెట్టి వర్ల కుమార రాజాను, . దర్శిలో పమిడి రమేష్‌ని ఇంచార్జ్‌గా నియమించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా ఉన్న పుంగనూరులో అనీషారెడ్డిని పక్కన పెట్టి చల్లా రామచంద్రారెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టారు.

భీమవరం నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులిపర్తి రామాంజనేయులు స్థానంలో తోట సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. అలాగే గంగాధర నెల్లూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా భీమినేని చిట్టిబాబును నియమించారు. ఇలా సడన్‌గా బాబు సీనియర్ నేతలని పక్కనబెట్టి వేరే వారికి ఛాన్స్ ఇచ్చారు.

అయితే ఇందులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన పామర్రులో ఊహించని మార్పు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పామర్రులో మొదట నుంచి ఉప్పులేటి కల్పన ఉంటున్నారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయాక కల్పన అసలు యాక్టివ్‌గా పనిచేయడం లేదు. అసలు పార్టీలో కనిపించడం లేదు. పైగా వైసీపీతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకుని ముందుకెళుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బాబు….ఆమెని తప్పించి సీనియర్ నేత వర్ల రామయ్య తనయుడు వర్ల రాజాని ఇంచార్జ్‌గా పెట్టినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news