మ‌ళ్లీ అత‌డు ఒంటరే! వ‌ద్ద‌నండి కానీ..?

వైసీపీ రాజ‌కీయాలలో భాగంగా ఒక స్థాయిలో త‌న‌దైన వాగ్బాణాలు సంధించి ఆఖ‌రికి పూర్తిగా సైలెంట్ అయిపోయిన దాఖ‌లాలే ఇప్పుడు వంశీకి మిగిలాయి. రాజ‌కీయంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం క‌నుక మ‌న ద‌గ్గ‌ర ఉన్న ప‌రిణామాలు త‌రువాత త‌రువాత మారిపోతూ ఉంటాయి అనేందుకు ఉదాహ‌ర‌ణ‌లే ఎన్నో! కొద్ది రోజులుగా వంశీ మ‌రీ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఆయ‌నను వైసీపీ ప‌ట్టించుకోవ‌డం మానేసింది.

ఒక‌నాడు అసెంబ్లీ వేదిక‌గానో మీడియా ముఖంగానో టీడీపీని తిట్టిపోసిన వంశీని ఇప్పుడు ఫ్యాన్ పార్టీ దూరం పెట్ట‌డ‌మే కాదు మంచి రోజులు వ‌చ్చేదాకా ఆయ‌న్ను ఏమీ మాట్లాడ‌వ‌ద్ద‌నే అంటోంది. ఎందుకంటే టీడీపీని ఉద్దేశించి మాట్లాడిన ప్ర‌తిసారి ఆయ‌న ఉద్దేశాలు అన్నీ వివాదాస్ప‌దం అయ్యాయి. దీంతో ప‌బ్లిక్ లో ఆయ‌న ఇమేజ్ ఒక్క‌సారిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ త‌రుణంలో వంశీని వైసీపీ పూర్తిగా వ‌దిలించుకోవ‌డంలో కూడా ముందుంది అని కూడా తెలుస్తోంది.

రాజకీయంగా వైసీపీ క‌న్నా టీడీపీనే చాలా యాక్టివ్.త‌మపై ఎటువంటి చెడు ప్ర‌చారం వెలుగులోకి వ‌చ్చినా వెంట‌నే వాటిని కౌంట‌ర్ చేస్తూ రాయ‌డంలోనూ రాయించ‌డంలోనూ టీడీపీనే చాలా షార్ప్. ఇదే సూత్రం వైసీపీ అమ‌లు చేయ‌దు. చేయ‌లేదు కూడా! ఎందుకంటే టీడీపీలో సోష‌ల్ మీడియా చాలా యాక్టివ్. వైసీపీ ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు చేసినా కూడా ఎందుక‌నో స‌క్సెస్ కాలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో వైసీపీని అట్టిపెట్టుకుని ఉండ‌డం ఇవాళ వంశీకి కుద‌ర‌ని ప‌ని. అంతేకాదు టీడీపీ మైండ్ గేమ్ లో వంశీ సులువుగా చిక్కుకుపోయి విల‌విల‌లాడుతున్నారు.

భువ‌న‌మ్మ‌ను తిడ‌తారా అంటూ టీడీపీ చేసిన హంగామా కూడా వైసీపీ ఇమేజ్ పూర్తిగా ప‌డేసింది. అందుకే ఎందుకు వ‌చ్చిన గొడవ అని ఆయ‌న‌కు దూరం కావాల‌ని వైసీపీ అనుకుంటోంది.అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డం కూడా కుద‌ర‌ని ప‌ని అని తేలిపోయింది.