జగన్ చేర్చుకుంటే టీడీపీలో ఒక్కరు ఉండరు: వల్లభనేని

వైసీపీలో టీడీపీ నేతలు చేరికపై ఇప్పుడు టీడీపీ నేతలు వరుస మీడియా సమావేశాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైసీపీని పార్టీ మారిన వారిని విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీనిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభేని వంశీ స్పందించారు. అసలు జగన్ నిజంగా టీడీపీ వాళ్ళను పార్టీలో చేర్చుకుంటే అసలు ఒక్కరు కూడా టీడీపీలో ఉండరు అని వల్లభనేని వంశీ అన్నారు. తమను ఎవరూ ఒత్తిడి చేయలేదని ఆయన అన్నారు.

ఇష్టపూర్వకంగానే తాము పార్టీ మారామని, సిఎం జగన్ కు సంఘీభావం తెలిపామని అన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నిజంగా ద్రోహులు అయితే వారికీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని ఆయన ఎద్దేవా చేసారు. కాగా నిన్న టీడీపీ నుంచి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సిఎం జగన్ కు మద్దతు ఇచ్చిన సంగతి విదితమే.