బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసిందే. ఇటీవల లండన్ పర్యటన ముగించుకొని భారత్ కు తిరిగి వచ్చిన కనికా ఫ్లూ లక్షణాలు కనిపించడం తో టెస్ట్ లు చేయించుకున్నారు. దీనితో ఆమెకు కరోనా పాజిటివ్ అన్నట్లుగా తెలిసింది. అయితే ఇటీవలే ఆమె లక్నో లోని కనికా కపూర్ ఒక డిన్నర్ కార్యక్రమంలో హాజరైనట్లు తెలుస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఈ పార్టీ కి రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుశ్యంత్‌తో పాటు బంధువులు హాజరయ్యారు. కనికాతో భోజనం చేయడంతో పాటు ఆమెతో కలిసి ఫొటోలు దిగారు. పార్టీలో ఆమెకు దగ్గరగా మెలిగారు. ఐతే అంతలోనే కనికాకు కరోనా సోకిందన్న విషయం తెలియడం ఇప్పడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎంపీగా ఉన్న దుశ్యంత్.. కనికాను కలిసిన అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అంతేకాదు ఈ నెల 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలవడం తో పార్లమెంట్‌లోనూ కరోనా కలకలం రేగింది. ఇండియా స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న కనికా కపూర్ బేబీ చిట్టియాన్ కలైయాన్ లాంటి పాటలతో ఆమెకు బాగా పేరు వచ్చింది. అయితే లండన్ వెళ్లిన కనికా మార్చి 15 న లక్నో కు వచ్చింది. అయితే లక్నో చేరుకున్న తర్వాత ఆమె తన స్నేహితులు,కుటుంబ సభ్యులతో కలిసి స్టార్ హోటల్ లో గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వారందరితో ఫోటోలు దిగగా,ఆ తరువాత ఫ్లూ లక్షణాలు కనిపించడం తో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు జరిపించగా అసలు విషయం బయటపడింది. కనికా కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించడం తో లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నారు. మరోపక్క కనికాకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వసుంధరా రాజే ఫ్యామిలీ అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. లక్నోలో తాము హాజరైన ఓ డిన్నర్ పార్టీకి కనికా కూడా వచ్చిందని.. దురదృష్టవశాత్తు ఆమెకు కరోనావైరస్ సోకిందని వసుంధరా రాజే తెలిపారు. అందుకే ముందుజాగ్రత్తగా తాను, దుశ్యంత్ స్వీయ నిర్బంధంలో ఉన్నామని ట్వీట్ చేశారు రాజే.