టైమ్ చూసి జగన్ కి గట్టి దెబ్బ వేసిన వెంకయ్య నాయుడు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయాన్ని అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా విభేదిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. గత రెండు నెలలకు పైగానే అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు కూడా అమరావతి ప్రాంత రైతులకు మద్దతు తెలపడం జరిగింది. Image result for venkaiah naidu jagan

అయితే ఎక్కడా కూడా సీఎం జగన్ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు నిరసనలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. దీంతో రాజధాని రైతులు ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో రాజధాని రైతులకు ముందే జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తో భేటీ కావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో అంతా లైన్ క్లియర్ చేసుకుంటున్నా జగన్ కి టైం చూసి గట్టి దెబ్బ వెంకయ్యనాయుడు వేసినట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

రాజధాని అమరావతి విషయంలో వెంకయ్య నాయుడు టిడిపి ఎమ్మెల్సీలకు రాజధాని రైతులకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విషయాన్ని కేంద్రంలో పెద్దగా బూచిగా చూపించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే మరోపక్క ఇదే విషయంపై మోడీ మరియు అమిత్ షా దగ్గర జగన్ చర్చించడంతో…ఇదే సందర్భంలో వెంకయ్య నాయుడు టిడిపి ఎమ్మెల్సీలకు రాజధాని వ్యవహారంపై అపాయింట్ మెంట్ ఇవ్వటంతో ఏపీ రాజధాని విషయంలో కేంద్రం డబుల్ గేమ్ ఆడుతుందా అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో నెలకొంది.