రాములమ్మ అసెంబ్లీకా? పార్లమెంటుకా?

-

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడే రాములమ్మ రాజకీయంగా సక్సెస్ చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. అనేక పార్టీలు మారిన సరే రాజకీయంగా సక్సెస్ అందలేదు. అయితే ఈ సారి బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో రాములమ్మకు ఈ సారి సక్సెస్ వచ్చేలా ఉంది.

సినిమాల్లో సూపర్ సక్సెస్ అయ్యి…హీరోలతో పోటీగా విజయాలు అందుకున్న రాములమ్మ రాజకీయంగా అంతగా సక్సెస్ చూడలేదనే చెప్పొచ్చు. మొదట బీజేపీలో చేరి, తర్వాత తల్లి తెలంగాణ పెట్టి విఫలమయ్యారు. ఇక నెక్స్ట్ టీఆర్ఎస్ లో చేరి…తొలిసారి ఎంపీగా గెలిచారు. 2009లో మెదక్ ఎంపీగా గెలిచారు. అలాగే కేసీఆర్ తో కలిసి పార్లమెంట్ లో తెలంగాణ కోసం పోరాటం చేశారు.

కానీ తెలంగాణ వచ్చాక రాములమ్మని కేసీఆర్ సైడ్ చేసేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ లోకి వచ్చి 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అలాగే ఆ పార్టీ బలం నిదానంగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీలోకి రాములమ్మ మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. ఇక బీజేపీలో చేరాక..విజయశాంతి వెనక్కి తిరిగి చూసుకోలేదు… నిత్యం కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఇలా దూకుడుగా ఉంటున్న రాములమ్మని బీజీపే…అసెంబ్లీ సీటులో పోటీ చేయిస్తుందా? లేక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయిస్తుందా? అనేది క్లారిటీ రావడం లేదు. అయితే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం బీజేపీ టార్గెట్…కాబట్టి రాములమ్మని అసెంబ్లీ ఎన్నికల బరిలో దించే అవకాశాలు ఉన్నాయి..ఎలాగో పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత ఉంటాయి…దీంతో విజయశాంతిని అసెంబ్లీ బరిలో దించడం ఖాయమని తెలుస్తోంది. అయితే అంతకముందు పోటీ చేసిన మెదక్ అసెంబ్లీలో దింపుతారా? లేక వారే సీటు కేటాయిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news