బెజవాడ రాజకీయం ఈ సారి ‘ మహిళా ‘ నేతలతో వేడెక్కింది ..!

-

రాజకీయాలు నడపడం లో బెజవాడ నాయకుల తీరే వేరు. చాలామంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మహామహులు ఈ ప్రాంతం నుండి వచ్చిన వాళ్లే. తెలుగు రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ ఎప్పుడూ వేడిగా ఉంటాయి. అటువంటిది ఇప్పుడు బెజవాడలో రాజకీయ మొత్తం మహిళా నేతల చుట్టూ తిరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే విజయవాడలో తెలుగుదేశం పార్టీ లో ముగ్గురు మహిళా నాయకులు దూకుడు పెంచడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.Maoists in a letter threatens to kill TDP MLA – Mysuru Todayఆ ముగ్గురు మహిళా నేతలు గురించి తెలుసుకుంటే ఒకరు ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత‌, తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ స‌తీమ‌ణి అనురాధ‌, సెంట్ర ల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా స‌తీమ‌ణి సుజాత‌. ఈ ముగ్గురు మహిళా నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించడం కోసం ప్రజల దగ్గర సానుభూతి సంపాదించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ సాయం పేరిట బెజవాడలో ఉన్న పేదలకు నిత్యం ఏదో రూపంలో సేవలు చేస్తున్నారు.

 

వాటికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ అవ‌కాశం అందిపుచ్చుకుని ఈ ముగ్గురు టీడీపీ మ‌హిళా నేత‌లు ప్రజ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురూ కూడా ఎవ‌రికి వారు ఎక్కడా త‌గ్గకుండా త‌మ‌ను తాము నిరూపించుకునే క్రమంలో దూసుకుపోతున్నారు.ముగ్గురి టార్గెట్ ఒక్కటే అదేమిటంటే మేయర్ పీఠం. మరి ఈ ముగ్గురిలో టీడీపీ అధిష్టానం టికెట్ ఎవరికీ కేటాయిస్తుందో చూడాలి.   

Read more RELATED
Recommended to you

Latest news