షాకింగ్.. బయటపడిన వీవీ ప్యాట్ స్లిప్పులు..!

42

ఈవీఎంతో పాటు ఉండే వీవీప్యాట్ స్లిప్పులు దొరికాయి. పాఠశాల ప్రాంగణంలో 200కు పైగా వీవీప్యాట్ స్లిప్పులు విద్యార్థులకు దొరికాయట. వాటిని వెంటనే స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించగా.. వాటిపై విచారణ ప్రారంభించారు.

ఈవీఎంలు చాలా స్ట్రాంగ్. వాటిని ఎవ్వరూ టచ్ చేయలేరు. స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. టైట్ సెక్యూరిటీ ఉందంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే వాటి ఆచరణలో ఫెయిల్యూర్ అవుతున్నారా అధికారులు అని అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే.

vvpat slips found in nellore
ఎందుకంటే.. వీవీప్యాట్ స్లిప్పులు ఓ స్కూల్ వద్ద దొరికాయి. అసలు వీవీప్యాట్ స్లిప్పులు బయటపడటం ఏంది. దీనిపై విచారణ ప్రారంభిస్తున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్నది. ఈవీఎంతో పాటు ఉండే వీవీప్యాట్ స్లిప్పులు దొరికాయి. పాఠశాల ప్రాంగణంలో 200కు పైగా వీవీప్యాట్ స్లిప్పులు విద్యార్థులకు దొరికాయట. వాటిని వెంటనే స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించగా.. వాటిపై విచారణ ప్రారంభించారు. అయితే.. ఆ స్లిప్పులు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం వాడినవని..


అయితే.. వాటిని కూడా భద్రపరచాలని.. వాటిని పోలింగ్ సిబ్బంది ఎందుకు ఇలా పడేశారో విచారణ చేస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. దీనిపై కలెక్టర్ కూడా స్పందిస్తూ.. దీనిపై విచారణ చేయించి నిజానిజాలు తేలుస్తామని వెల్లడించారు.