ఎన్నికల పేరుతో గుటకాయస్వాహా.. ఏపీలో రికార్డు తాగుడు..!

-

నోటిఫికేషన్ విడుదల కాగానే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయట. దీంతో మద్యం హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిందట. మార్చి 8 తారీఖ నుంచి మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి.

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మద్యం ఏరులై పారిందట. నిజం..

liquor sales increased in ap elections time
ఎన్నికల పేరు చెప్పుకొని ఏపీలో మాత్రం మద్యాన్ని పీల్చేశారట. ఇంతవరకు ఎప్పుడూ సేల్స్ కాని రీతిలో రికార్డు స్థాయి సేల్స్ జరిగాయట. ఎన్నికల దెబ్బకు మొత్తం వైన్ షాప్స్‌లో సరుకంతా ఖాళీ అయిందట.నోటిఫికేషన్ విడుదల కాగానే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయట. దీంతో మద్యం హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిందట. మార్చి 8 తారీఖ నుంచి మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత 12, 13 తేదీల్లోనూ ఏకంగా 302 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని షాపులకు తరలించారట.



అవన్నీ మరో రెండు రోజుల్లో అమ్ముడు పోవడం విశేషం. ఎన్నికల తర్వాత రోజున 178.31 కోట్ల రూపాయల మద్యం బాటిల్స్‌ను ఏపీ ప్రజలు కొన్నారట. 13న 124.48 కోట్ల రూపాయల మద్యాన్ని కొన్నారట. ఏ పండుగకూ లేనంతగా ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు విపరీతంగా అమ్ముడుపోయాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

liquor sales increased in ap elections time

Read more RELATED
Recommended to you

Latest news