కేసీఆర్ వర్సెస్ కమలం: హస్తినలో సూపర్ ట్విస్ట్‌లు?

-

కారు, కమలం పోరు ఇప్పుడు హస్తినకు చేరుకుంది…లోక్‌సభ వేదికగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ కొనసాగనుంది. అయితే రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ టార్గెట్‌గా బీజేపీ రాజకీయం చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎక్కడకక్కడే ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్‌ కూడా గట్టిగానే ప్రయత్నిస్తూనే ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు విషయంలో టీఆర్ఎస్ ఇరుకున పడుతూ వస్తుంది.

cm kcr bjp partyఅందుకే కేంద్రంలో బీజేపీని ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ చూస్తుంది. బడ్జెట్ సమావేశాలు సాక్షిగా బీజేపీని తెలంగాణ ప్రజల దృష్టిలో విలన్ చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎంపీల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఎలా వ్యవహరించాలి..ఏ అంశాలపై పోరాడాలి.. బీజేపీని ఎలా ఇరుకున పెట్టాలనే అంశంపై కేసీఆర్, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు ఎక్కువ కేటాయింపులు లేకపోతే బీజేపీని గట్టిగా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అసలు అన్నిరకాలుగా బీజేపీని బుక్ చేయాలని టీఆర్ఎస్ చూస్తుంది.

ఇటు టీఆర్ఎస్ రాజకీయానికి హస్తిన వేదికగా కూడా చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఏ మాత్రం టీఆర్ఎస్‌కు ఛాన్స్ ఇవ్వకుండా ముందుకెళ్లాలని బీజేపీ చూస్తుంది. టీఆర్ఎస్ ఏ అంశాన్ని తీసుకున్న దానికి గట్టిగా కౌంటర్లు ఇచ్చేయాలని చూస్తుంది.

ఇదే సమయంలో ఎంపీ డి.శ్రీనివాస్ విషయంలో కూడా బీజేపీని ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నెలలోనే డీఎస్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆయన పార్టీ మారిన వెంటనే..ఆయనపై అనర్హత వేటు పడేలా చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఎలాగో జూన్ వరకు ఆయన పదవీకాలం ఉంది. కాబట్టి బీజేపీ..డీఎస్‌పై అనర్హత వేటు వేయడానికి సహకరిస్తుందా? లేదా అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇప్పటివరకు తెలంగాణలో నడుస్తున్న కారు-కమలం పోరు..హస్తినకు చేరింది. మరి హస్తినలో ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news