ఎగ్జిట్ పోల్స్ క్రెడిబిలిటీ ఎంత…నమ్మాలా వద్దా

-

జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.అయితే ఈసారి గెలిచేది వీళ్ళే అంటూ పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి.ఇప్పుడు ఈ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి అంటూ చర్చలు జరుపుతున్నారు. ప్రాంతీయ పార్టీలపై జాతీయ సర్వేల లెక్కలు ఎప్పుడూ తప్పుతూనే ఉంటాయి.ఒకటో రెండో నిజం అయిన దాఖలాలు ఉన్నాయి.2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించినా అంతటి భారీ స్థాయిలో విజయం దక్కుతుందని స్థానిక సర్వేలు మాత్రమే అంచనా వేశాయి. దీంతో జాతీయ సర్వే ఫలితాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

ఫలితాలు ఎలాగో 4వ తేదీన రానున్నాయి.ఎవరు గెలుస్తారు అనేది ఎలాగో తేలిపోతుంది. అయితే ఎన్డీయే విజయంపై ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చిన ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా సంస్థ గతంలో అందించిన సర్వేల ఫలితాలను చూస్తే దాని విశ్వసనీయత అర్ధమవుతుంది.2023లో ఛత్తీస్ ఘడ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. అయితే ఫలితాల్లో మాత్రం బీజేపీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఘన విజయం సాధించింది. ఇదే సమయంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందని యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేయగా ఇదీ తప్పని ఫలితాలు నిరూపించాయి. అక్కడ కూడా బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేయగా అక్కడ టీఎంసీ ఏకంగా 200 సీట్లతో ఘన విజయం సాధించింది.ఇలా పలు సందర్భాల్లో ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పని తేలిపోయాయి.ఇక ఏపీ విషయంలోనూ ఇదే జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటకలోనూ ప్రజల నాడిని పట్టుకోవడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. ఎన్ని సంస్థలు సర్వే చేసినా కేవలం రెండు సంస్థలు చెప్పినవి మాత్రమే నిజమయ్యాయి. ఇక ఏపీలో ఈసారి పోలింగ్ ఎలా జరిగిందో అందరికీ తెలుసు.దీంతో ఫలితం అంచనా వేయడం మేధావులకు కూడా అంతు చిక్కలేదు.వైసీపీ నేతలు ఈ సర్వేలను తప్పు పడుతున్నారు.సీఎం జగన్ చెప్పినట్టు ఈసారి 150కి పైగా సీట్లు వస్తాయని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news