మంత్రుల్లో మళ్లీ గట్టెక్కెది ఎవరు?

-

ఒకసారి మంత్రులుగా చేసినవారు..మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి..అదేంటో గాని తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఒక సెంటిమెంట్ మాదిరిగా వస్తుంది. మంత్రులుగా చేసిన వారిపై వ్యతిరేకత పెరిగి..మళ్లీ గెలవడానికి ఛాన్స్ అంతగా రాదు. ఉదాహరణకు 2014లో టి‌డి‌పి హయాంలో మంత్రులుగా చేసిన వారు..2019 ఎన్నికల్లో దాదాపు ఓడిపోయారు. ఏదో ముగ్గురు మాత్రమే మళ్లీ గెలిచారు.

 

ఇటు తెలంగాణలో కూడా ఇంచుమించు అదే పరిస్తితి..కాకపోతే మరి ఎక్కువ మంది ఓడిపోలేదు. అయితే ఈ సారి తెలంగాణలో మంత్రులుగా చేస్తున్న వారు..ఈ సారి గెలుస్తారా? లేదా? అనే చర్చ సాగుతుంది. సీఎం కేసీఆర్‌ని మినహాయిస్తే..తెలంగాణ క్యాబినెట్ లో 16 మంది మంత్రులు ఉన్నారు. అందులో ఇద్దరు ఎమ్మెల్సీల ద్వారా మంత్రులు అయ్యారు. వారిని పక్కన పెడితే 14 మంది ఉన్నారు. మరి ఈ 14 మంది మంత్రుల్లో మళ్లీ ఎంతమంది గెలిచి గట్టెక్కుతారు అనే విషయాన్ని ఒక్కసారి చూస్తే..వీరిలో హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వారికి తిరుగులేదని సర్వేలు చెబుతున్నాయి. మళ్లీ వారి గెలుపుకు ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు.

అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి లాంటి వారికి కూడా కాస్త అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే ఆరుగురు మంత్రులకు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వారికి గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయని తెలుస్తోంది. ఇటు పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లాంటి వారికి సైతం గెలుపు అవకాశాలు అంత ఈజీ కాదని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారి మంత్రుల్లో ఎంతమంది గెలుస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news