రమణ-కౌశిక్: కేసీఆర్ ఛాయిస్ ఎవరు?

-

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ఓవైపు టిఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌ని తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక కొత్తగా టిపిసిసి అధ్యక్ష పీఠం దక్కడంతో రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రతిపక్షాలు ఇలా రాజకీయం చేస్తుంటే అధికార టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుంది.

L Ramana Koushik reddy

ఇప్పటికే సీఎం కేసీఆర్ టిడిపి అధ్యక్షుడు రమణని టిఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఇప్పటికే ఆయనకి పార్టీ సభ్యత్వం కూడా ఇచ్చారు. అలాగే మరోవైపు కాంగ్రెస్ లో కౌశిక్ రెడ్డి రచ్చ తెరపైకి వచ్చింది. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతానని మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి ఊహించని విధంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.

తాజాగా కౌశిక్ టిఆర్ఎస్ టికెట్ తనదే అని చెప్పి ఓ కార్యకర్త తో ఫోన్ మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వకుండా కౌశిక్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అలాగే రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కౌశిక్ టిఆర్ఎస్ లో చేరడం ఖాయమని తెలుస్తుంది. అయితే టిడిపి నుంచి వచ్చిన రమణ, కాంగ్రెస్ నుంచి కౌశిక్ ఈ ఇద్దరిలో హుజురాబాద్ టిఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియకుండా ఉంది. రమణ పార్టీలో చేరినప్పుడు ఆయనకే టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. హుజురాబాద్ బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి రమణకే టికెట్ వస్తుందని తెలుస్తుంది.

అదే సమయంలో హుజురాబాద్లో రెడ్డి వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో కౌశిక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 60 వేల పైనే ఓట్లు తెచ్చుకున్నారు. దీని ప్రకారం చూస్తే కౌశిక్‌కి హుజురాబాద్ టికెట్ ఇవ్వొచ్చని మరో వైపు ప్రచారం వస్తుంది. అయితే ఈ ఇద్దరిలో కెసిఆర్ ఎవరికి టికెట్ ఇస్తారు చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ ఇద్దరికీ కాకుండా మరో నాయకుడిని బరిలోకి దింపిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఉప ఎన్నిక షెడ్యూలు వచ్చాకే అభ్యర్థిని ఖరారు చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news