పరిటాల వారసుడికి కష్టమవుతుందా?

-

ఏపీ రాజకీయాల్లో బాగా క్రేజ్ ఉన్న యువ నాయకుల్లో పరిటాల శ్రీరామ్ కూడా ఒకరు..రాజకీయంగా ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయంగా పరిటాల ఫ్యామిలీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ ఫ్యామిలీ నుంచి పరిటాల వారసుడుగా వచ్చిన శ్రీరామ్ సైతం తక్కువ సమయంలోనే రాజకీయంగా బలమైన నాయకుడుగా ఎదిగారు.

అయితే ఇలా బలమైన ఫ్యామిలీ నుంచి శ్రీరామ్ ఇప్పుడు విజయం కోసం ఎదురుచూస్తున్నారు. పరిటాల ఫ్యామిలీ అభిమానులు గాని, టీడీపీ శ్రేణులు గాని శ్రీరామ్ విజయం పైనే దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో తొలిసారి శ్రీరామ్ పోటీకి దిగిన విషయం తెలిసిందే. అప్పుడే శ్రీరామ్ విజయంపై అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అప్పుడు ప్రజలు దృష్టి పెట్టిన సీట్లలో రాప్తాడు కూడా ఒకటి. అక్కడ ఫలితం ఎలా వస్తుందా? అని అంతా ఆతృతగా చూశారు.

ఇక ఊహించని విధంగా పరిటాల శ్రీరామ్ తొలిసారి పోటీ చేసి..తొలిసారి పరాజయం పాలయ్యారు. ఇలా పరిటాల ఫ్యామిలీకి తొలి పరాజయం వచ్చింది. అయితే ఈ సారి మాత్రం పరిటాల ఫ్యామిలీ పరువు నిలబెట్టాలనే కసితో శ్రీరామ్ పనిచేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అదిరిపోయే విజయం సొంతం చేసుకోవాలని కష్టపడుతున్నారు. అయితే శ్రీరామ్ బాగానే కష్టపడుతున్నారు గాని…మరి విజయం దక్కే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఏది చెప్పలేమనే చెప్పాలి..ఎందుకంటే పరిటాల ప్రత్యర్ధులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.

ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి…ధర్మవరం, రాప్తాడు సీట్లు. అయితే శ్రీరామ్ ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. అయితే రాప్తాడులో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నారు. వీరికి చెక్ పెట్టడం అంత ఈజీ కాదు. మరి వీరి మీద గెలవాలంటే పరిటాల ఇంకా కష్టపడాల్సిందే. మరి చూడాలి ఈ సారి శ్రీరామ్ కు గెలుపు కష్టమవుతుందో? సులువు అవుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news