రేవంత్ బీజేపీ లోకి వెళ్తారా లేదా ? ఆ పదవేనా డిసైడ్ చేసేది ?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి కి మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మంచి ప్రాధాన్యం ఉంది. రాజకీయాలను ఏ వైపుకు మలుపు తిప్పాలంటే, ఆ వైపు మలుపు తిప్పగల సమర్ధుడన రాజకీయ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. అందుకే ఆయన కాంగ్రెస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారా , తమ పార్టీలో చేసుకుందామా అని బిజెపి వంటి పార్టీలు ఎదురుచూపులు చూస్తున్నాయి.
రేవంత్ ను పార్టీలో చేర్చుకుంటే,  అధికారం వైపు రాష్ట్ర నాయకత్వం ను నడిపించే విధంగా ఆయన యాక్టివ్ చేయగలరని బిజెపి నమ్ముతోంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనపై బలంగా ఆశలు పెట్టుకుంది. అందుకే టీడీపీ నుంచి వచ్చి చేరిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆయనకు కట్టబెట్టారు. అయితే మిగిలిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల నుంచి తగిన సహకారం లభించకపోయినా, రేవంత్ సర్దుకుపోతూ వస్తున్నారు.
తన స్థాయికి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి అవసరమని రేవంత్ చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు పదవి రాకుండా అడ్డుకోవడం పై రేవంత్ చాలా కాలంగా ఆగ్రహంగా ఉన్నారు  అధిష్టానం తనకే తప్పకుండా ఆ పదవి ఇస్తుంది అని అభిప్రాయపడుతూ వస్తున్నారు.  సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలో బిజెపి బలపడడం, దుబ్బాక లో విజయం సాధించడం వంటి వ్యవహారాలతో, ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకోవాలనే ఆలోచనలో బిజెపి ఉంది. ఈ క్రమంలోనే తమ పార్టీలో చేయాల్సిందిగా రాయబారాలు పంపుతూ, అనేక కీలక పదవులు ఇస్తామని హామీ ఇస్తూ ఉండడంతో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో, ఇక ఆ పార్టీ ని పట్టుకుని వేలాడితే తన రాజకీయ భవిష్యత్తు కి ఇబ్బంది ఏర్పడుతుంది అనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.
అయితే తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ లో ఉండాలని,  లేకపోతే బీజేపీలో చేరాలి అనే అభిప్రాయంతో రేవంత్ ఉన్నట్టుగా సమాచారం. రేవంత్ కనుక బిజెపి లో చేరితే ఆయన వెంటే వెళ్లాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం డిసైడ్ అయ్యారట. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ ఉండాలన్నా, బీజేపీ వైపు వెళ్లాలన్నా, పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news