టీడీపీకి మరోసారి దొరికిపోయిన వైసీపీ…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఇప్పుడు విపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం పాత్రపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకుంటుందని, అధికార పార్టీకి ఒక న్యాయం మాకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.

“ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకొచ్చినా పంచాయితీ భవనాలకు వైసీపీ పార్టీ రంగులుంటే ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. చివరికి రంగులను తొలగించమని హైకోర్టు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ జారీ చేస్తున్న ధ్రువపత్రాలపై జగన్ గారి బొమ్మ కనిపిస్తోంది. ఎన్నికల సంఘం ఏం చేస్తుందో మరి.” అంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది. ఈ సందర్భంగా ధ్రువ పత్రాలను పోస్ట్ చేసింది.

ఇప్పటికే కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాచర్లలో నిన్న టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నపై వైసీపీ నేత ఒకరు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక లాయర్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. ఇక నామినేషన్ పత్రాలను లాక్కుని అధికార పార్టీ నేతలు చించి వేయడం వివాదాస్పదంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news