నానా పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది..ఈ డైలాగ్ ఇటీవల బాగా ఫేమస్ అయింది.. కుట్రలు పన్నేందుకుఎదురుగా ఎంతమంది ఉన్నా.. సింహంలాగా ఢీకొట్టాననే కోణంలో ఈ డైలాగ్ వాడతాం.. సరిగ్గా ఇప్పుడు రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి..ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డగా భావించే.. సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి.. గతంలో కూడా వైఎస్సార్ ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకమై చతికలపడ్డారు..
2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ, టీఆర్ ఎస్, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు ఏకమయ్యాయి.. కొన్నిమీడియా సంస్థలు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాబోతుందంటూ ప్రజలనుడైవర్ట్ చేశాయి.. మహాకూటమి కుట్రలను, చిరంజీవి ఎత్తులను ధీటుగా ఎదుర్కొన్న వైఎస్సార్.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. రెండోసారి యుపిఎ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 33 సీట్లను ఏపీ నుంచి అందించారు.. ఏపీలో రెండోసారి కాంగ్రెస్ కు పవర్ ను అందించారు.. సేమ్ అదే సీన్ 2024లో కూడా రిపీట్ అవ్వబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
రాష్ట రాజకీయాల్లో బలమైన నేతలుగా చెప్పుకునే అతికొద్ది మందిలో నందమూరి తారకరామారావు, వైఎస్సార్, సీఎం జగన్.. వీరందరూ ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. జనాలతో మమేకమయ్యారు.. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జనంలో తిరిగారు.. అనంతరం జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు.. రామారావు, వైఎస్సార్, జగన్ విషయంలో అదే జరిగింది.. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు గత ఎన్నికల్లో తోడేళ్లు అన్ని ఏకమయ్యాయయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..
2024లో టీడీపీ, జనసేన, బిజేపీ కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. సీఎం జగన్ ను గద్దె దించాలనే నాలక్ష్యంతో విధానాలు వేరైనా.. వారంతా ఏకమవుతున్నారు..రానున్న ఎన్నికల్లో టీడీపీ +జనసేన ప్రస్తుతం పొత్తులో ఉండగా బిజెపిని సైతం ఆ కూటమిలోకి కలుపుకునేందుకు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి పెద్దలను కలిసి తమతో కలిసిరావాల్సిందిగా కోరుతున్నారు.
కమ్యునిష్టులను సైతం తమతో తీసుకుపోయేందుకు చంద్రబాబు తన రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు.. సీఎం జగన్ మాత్రం ప్రజలతోనే తన పొత్తు అంటూ.. జనాలనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు.. సర్వేలు చేసుకుంటూ.. సరైన అభ్యర్దులను బరిలోకి దింపాలని వ్యూహాలు రచిస్తున్నారు.. టీడీపీ, జనసేన, బిజేపీ కూటమిపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.. మరోసారి ఈ కూటమిని ఘోర ఓటమి తప్పదని చర్చించుకుంటున్నారు.. హిస్టరీ రిపీట్ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..