విశాఖలో అనుకున్నంత సినిమా లేదా…?

-

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కనుక అధికార వైసీపీ గెలవలేదు అంటే మూడు రాజధానులు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలువలేకపోతే ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడవచ్చు.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రచారం చేసుకున్న విధంగా విశాఖ జిల్లాలోపార్టీ అనుకున్న విధంగా గెలవలేకపోయింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీని ఇస్తోంది గాని గెలవలేదు. అరకు పార్లమెంట్ పరిధిలో కూడా చాలా స్థానాలను అధికారి వైసిపి కైవసం చేసుకోలేక పోయింది. ఇప్పుడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ అధికార పార్టీపై వ్యతిరేకత ఉంది అనే భావన వ్యక్తమవుతోంది.

అవినీతి ఆరోపణలు విశాఖ జిల్లాలో ఎక్కువగా వినపడుతున్నాయి. అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఒక నేత కేంద్రంగా విశాఖ జిల్లాలో భూ కబ్జాలు జరుగుతున్నాయి అనే ఆవేదన వ్యక్తమవుతోంది. దీనిపై ప్రజల్లో కూడా అసహనం పెరిగిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇప్పుడు విశాఖలో వైసీపీకి గెలవడం అనేది అసాధ్యం అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి విజయసాయిరెడ్డి సహా నలుగురు మంత్రులు విశాఖలో కష్టపడినా సరే అనుకున్న విధంగా పరిణామాలు లేకపోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news