నెల్లూరులో రివర్స్ షాక్..వైసీపీలోకి టీడీపీ నేత.!

-

వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్య..ఆ పార్టీకి వరుస షాకులు తగిలిన విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన కీలక నేతలు, జగన్ కు విధేయులుగా ఉండే నాయకులు..ఆ పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..వైసీపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ పర్తి నుంచి బయటకొచ్చేశారు.

అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు వేశారు..దీంతో వీరిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు..అయితే వారికి కూడా కావాల్సింది వైసీపీ నుంచి బయటకెళ్లడమే. ఇక అలా వైసీపీ నుంచి బయటకొచ్చిన వీరు..ఎన్నికల సమయంలో టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇలా కీలక నేతలు బయటకు రావడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఈ క్రమంలో నెల్లూరులో డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు వైసీపీ చూస్తుంది. ఎమ్మెల్యేలు జంప్ అయిన చోట..కీలక నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు.

ఇప్పటికే వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇక ఉదయగిరిలో కూడా బలమైన నేతని పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మేకపాటి రాజమోహ రెడ్డి, విక్రమ్ రెడ్డి..నెల్లూరు రాజకీయాలు అందులోనూ..తమ సొంత స్థానాలు ఆత్మకూరు, ఉదయగిరిలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

ఈ క్రమంలోనే టి‌డి‌పిలో ఉన్న కీలక నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఈయన వైసీపీలోనే పని చేశారు. కానీ టి‌డి‌పి అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలోకి వచ్చారు. ఇక టి‌డి‌పిలో సీటు వస్తుందని ఆశిస్తున్నారు. కానీ ఆయనకు సీటు ఛాన్స్ లేదు. దీంతో ఆయన టి‌డి‌పికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని వైసీపీలోకి తీసుకు రావాలని చూస్తున్నారు. అలా రివర్స్ ఆపరేషన్ చేసి టి‌డి‌పి నేతలలని లాగి..ఆ పార్టీకి షాక్ ఇవ్వాలనేది వైసీపీ స్కెచ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version