అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అయినా మళ్లీ పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా బానోతు హరిప్రియ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేశారు.
అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అయినా మళ్లీ పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటించారు. సీఎం కేసీఆర్ మాత్రమే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని విశ్వసిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆమె వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ఉన్న విజన్.. దాని కోసం ఆయన పడే తపన తనను మంత్రముగ్ధురాలిని చేశాయని ఆమె ఈసందర్భంగా లేఖలో పేర్కొన్నారు.
ఆమె విడుదల చేసిన ప్రెస్ నోట్ ఇదే..