అతను చనిపోయాడు అని ఫోన్ రాగానే .. ఎమోషనల్ అయిపోయిన జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చదువుకున్న చిన్ననాటి క్లాస్ మేట్ ఏడిద జగదీశ్ (39) ఊహించని విధంగా కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది. సీఎం వైఎస్ జగన్ తో కలిసి చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన ఏడిద జగదీశ్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. Image result for ys-jagan crying

గతంలో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన సమయంలో విశాఖపట్టణంలో సొంతూరులో అనకాపల్లి కి జగన్ వచ్చిన సమయంలో ఏడిద జగదీశ్ మరికొంతమంది స్కూల్ స్నేహితులతో వైయస్ జగన్ ని కలవడం జరిగింది. అయితే తాజాగా ఏడిద జగదీశ్ స్కూల్ సమయంలో దిగిన ఫోటో లతో పాటు ప్రజా సంకల్ప పాదయాత్ర వైయస్ జగన్ తో దిగిన ఫోటోలతో కలిపి ఓ భారీ ఫ్లెక్సీని తయారు చేయించి తన ఇంటి ముందు కట్టాలనుకున్నారు.

 

అలా ఆ ఫ్లెక్సీని తన ఇంటి ముందు కట్టేందుకు శ్రీనుతో కలిసి పైకి ఎక్కాడు. ఆ సమయంలో గాలి అధికంగా వీచడంతో ఫ్లెక్సీ కాస్తా ఇంటి ముందే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న ఇద్దరూ షాక్ కు గురయ్యారు. దీంతో వెంటనే స్థానికులు మరియు కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనలో ఏడిద జగదీశ్ (39) తో పాటు ముప్పిడి శ్రీను (42)  మరణించడం జరిగింది.