బాబు అడ్డాలో సీన్ రివర్స్.. జగన్ తగ్గుతున్నారా?

ఏపీలో అధికార వైసీపీ బలం నిదానంగా తగ్గుతుందా? అంటే 2019 ఎన్నికల సమయంతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గుతూ వస్తుందనే చెప్పొచ్చు…సాధారణంగా ఏ అధికార పార్టీకైనా కాస్త వ్యతిరేకత పెరగడం సహజమే..అలాగే ఇప్పుడు వైసీపీకి కూడా వ్యతిరేకత పెరుగుతుంది…నిదానంగా వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది..2019 ఎన్నికల్లో బలం ఇప్పుడు లేదనే చెప్పొచ్చు.

chandrababu naidu ys jagan

అయితే జిల్లాల వారీగా చూసుకుంటే…గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ కొనసాగిన కొన్ని జిల్లాల్లో ఇప్పుడు వైసీపీ హవా తగ్గుతుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా సీన్ రివర్స్ అవుతుందని తెలుస్తోంది. 2014 ఎన్నికలు కావొచ్చు, 2019 ఎన్నికలు కావొచ్చు..చిత్తూరులో వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది. 2014లో జిల్లాలో ఉన్న 14 సీట్లకు గాను…వైసీపీ 8, టీడీపీ 6 సీట్లు గెలుచుకుంది…2019 ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 1 సీటు మాత్రమే గెలుచుకుంది..అంటే చిత్తూరులో జగన్ వేవ్ ఎలా వీచిందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే 2019 ఎన్నికల తర్వాత చిత్తూరులో నిదానంగా సీన్ మారుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది..అధికార బలం ఉండటం వల్ల స్థానిక ఎన్నికల్లో వైసీపీనే సత్తా చాటింది…కానీ సాధారణ ఎన్నికలోచ్చేసరికి ఈ పరిస్తితి ఉండేలా లేదు..ఎంత కాదు అనుకున్న ఈ సారి మాత్రం వైసీపీకి 13 సీట్లు రావడం కష్టమే అని తెలుస్తోంది. అయితే ఈ సారి కుప్పంలో కూడా పాగా వేసి 14కి 14 సీట్లు గెలుచుకోవాలనేది వైసీపీ ప్లాన్.

కానీ ఇదంతా ప్లాన్ గానే మిగలనుందని విశ్లేషకులు అంటున్నారు…ఈ సారి అనుకున్నంత ఈజీగా చిత్తూరులో వైసీపీ గెలవడం కష్టమని తెలుస్తోంది…ఇప్పటికే నాలుగైదు సీట్లలో వైసీపీ బలం తగ్గినట్లు కనిపిస్తోంది. మరి ఎన్నికల నాటికి ఇంకెంత తగ్గుతుందో చూడాలి…కాకపోతే ఎంత బలం తగ్గిన ఈ సారి కూడా చిత్తూరులో వైసీపీకే ఆధిక్యం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. వైసీపీ ఖచ్చితంగా 7-8 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి బాబు అడ్డాలో జగన్ ఇమేజ్ ఎలా పనిచేస్తుందో.