కరక్ట్ టైమ్ లో గ్రౌండ్ ఫోర్సెస్ సిద్ధం చేసిన జగన్ ?

-

కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి టైములో వైసిపి పార్టీ గ్రౌండ్ లెవెల్ నుండి అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండటానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన ఈ విపత్కర రోజులను తన ప్రభుత్వానికి అనుకూలంగా మారేలా నిత్యం పార్టీ నేతలు ప్రజల మధ్య ఉండాలని.. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చాలని జగన్ ఇటీవల నాయకులకు సూచించారట.YS Jagan Mohan Reddy: HC orders CBI probe into death of YS Jagan ...ఒక పక్క ప్రతిపక్షనేత చంద్రబాబు ఇలాంటి విపత్కర సమయంలో రాష్ట్రంలో లేకుండా ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి ఉండటంతో జగన్ సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య కనిపించిన అక్కడ వైసీపీ నేతలే అక్కడ కనిపించాలని ప్రాబ్లెమ్ సాల్వ్ చేయాలని సూచించారట. ఈ విషయం నడుస్తూ ఉండగానే పార్టీని గ్రౌండ్ లెవెల్ లో పటిష్టంగా వుండేలా సరికొత్త ఫోర్సెస్ తాజాగా జగన్ సిద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఉద్యోగాలకు వెళ్ళలేక అనేక అవస్థలు పడుతున్నారు.

 

ఇటువంటి సమయంలో చాలా వరకూ ప్రభుత్వం తరఫున ఈ విపత్కర సమయంలో 2 సార్లు రేషన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే జరగబోయే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో లోకల్ ఎలక్షన్స్ లో పోటీ చేసే నాయకులు ఎక్కడైతే పోటీ చేయబోతున్నారో ఆ ప్రాంతాలలో ప్రజల అవసరాలు తీరేలా సేవా కార్యక్రమాలు చేయాలని తాజాగా కొత్త సూచనలు ఇచ్చారట. తాజా పరిస్థితుల వల్ల అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును అందుకుని లోకల్ ఎలక్షన్ లో పోటీ చేసే నాయకులు తమ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు ప్రజలకు అవసరతలు తీరేలా చేయడం స్టార్ట్ చేశారు. మంత్రులు కూడా ఈ కార్యక్రమాలను అన్నీ దగ్గరుండి చూస్తున్న నేపధ్యం లో వచ్చే స్థానిక ఎన్నికలలో వైసీపీ పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలవడం గ్యారెంటీ అని ధీమాగా ఉన్నారు. కాగా ఈ లోకల్ ఎలక్షన్స్ విక్టరీ తో పూర్తిగా టీడీపీ పార్టీ నీ నామరూపాలు లేకుండా నేలమట్టం చేయాలనీ జగన్ డిసైడ్ అయ్యారట. 

Read more RELATED
Recommended to you

Latest news