కరోనా పై యుద్ధం :  అత్యంత కీలక నిపుణుడిని రంగం లోకి దించిన ఏపీ సర్కార్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి లో కరోనా వైరస్ కంట్రోల్ లో ఉన్నాగాని ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ నమోదు కావడంతో ఏపీలో పాజిటివ్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు రోజుల్లోనే ఏపీలో కరోనా పాజిటివ్ సంఖ్య పెరగటంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ప్రజలెవరూ ఇంటి నుండి బయటకు రాకుండా నిత్యావసరాల సరుకులు మరియు కూరగాయలు కూడా ఇంటికే పరిమితం చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.Andhra Pradesh CM YS Jagan urges public to observe Janata Curfewఇటువంటి తరుణంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడం కోసం అత్యంత కీలక నిపుణులు వైద్య రంగంలో మంచి పేరు సంపాదించిన డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ గా రంగంలోకి దించింది ఏపీ సర్కార్. శ్రీనాథ్ రెడ్డి గతంలో ఢిల్లీ ఎయిమ్స్ లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా పని చేయడం జరిగింది. వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలపై ఆయనను రంగంలోకి దీనికి సీఎం జగన్ ప్రస్తుత పరిస్థితి అదుపు చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో శ్రీనాథ్ రెడ్డి తో చర్చించడానికి రెడీ అయ్యారు.

 

ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు భారీ ఎత్తున ఏపీ రాష్ట్రం నుండి 500 మంది దాకా హాజరైనట్లు తేలడంతో వాళ్ళందరికీ ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వీళ్ళ ద్వారా వీళ్ళ కుటుంబ సభ్యులకు వాటిద్వారా ఇతరులకు సోకిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిని కట్టడి చేయడానికి అత్యంత కీలకం నిపుణుడిగా వైద్య రంగంలో మంచి పేరు సంపాదించిన కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా జగన్ ప్రభుత్వం నియమించింది.

Read more RELATED
Recommended to you

Latest news