చినబాబుకు చెక్: ఆర్కే అవుట్…గంజి ఇన్..?

-

మొత్తానికి మంగళగిరి నియోజకవర్గం వైసీపీలో ఊహించని మార్పులు చోటు  చేసుకుంటున్నాయి… ఇప్పటివరకు వైసీపీకి కంచుకోటగా ఉన్న మంగళగిరిలో టీడీపీ బలం నిదానంగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇలా రెండు సార్లు గెలిచిన ఆర్కేపై ఇప్పుడు ప్రజా వ్యతిరేకత నిదానంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా అమరావతి ఎఫెక్ట్ ఆర్కేపై బాగా ఉంది.

అదే సమయంలో గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన నారా లోకేష్… ఇక్కడ దూకుడుగా పనిచేస్తున్నారు… త్వరగానే ఇక్కడ పికప్ అయ్యారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో లోకేష్‌కు మంగళగిరిలో గెలుపు అవకాశాలు పెరిగాయని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మళ్ళీ చినబాబుకు చెక్ పెట్టడానికి జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు కంచుకోట కుప్పంపై ఫోకస్ చేసి అక్కడ వైసీపీని నిలబెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మంగళగిరిలో కూడా మళ్ళీ సత్తా చాటాలని జగన్ ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే మంగళగిరిలో బలమైన సామాజికవర్గంగా ఉన్న చేనేత వర్గానికి చెందిన నేతలని వైసీపీలోకి లాగుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుని వైసీపీలోకి తీసుకొచ్చి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే మురుగుడు వెళ్లిపోవడం వల్ల టీడీపీకి పెద్ద నష్టం లేదని విశ్లేషణలు వచ్చాయి. కానీ తాజాగా గంజి చిరంజీవులు సైతం టీడీపీని వదిలి వైసీపీలో చేరారు.

మంగళగిరిలో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది… 2014 ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతోనే ఆర్కేపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో చినబాబుకు కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది..అయినా సరే గంజికి టీడీపీలో ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో ఆయన వైసీపీలోకి వచ్చేశారు. గంజి వైసీపీలోకి వెళ్ళడం చినబాబుకు కాస్త నష్టమే అని చెప్పొచ్చు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఆర్కేని సైడ్ చేసి గంజికి మంగళగిరి సీటు ఇస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఆర్కేని సత్తెనపల్లి పంపించే అవకాశాలు ఉన్నాయని టాక్. మొత్తానికి చినబాబుకు చెక్ పెట్టడానికి జగన్ అదిరిపోయే వ్యూహాలు వేస్తున్నారు. మరి ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news