జ‌గ‌న‌న్న ఇటు చూడ‌న్న : సొంత గూటిలో విల‌న్లు ?

-

జ‌గ‌న్ పార్టీలో ఎమ్మెల్యేల గ్రాఫ్ అన్న‌ది కొంద‌రికి అనుకూలంగా లేద‌ని తేలిపోయింది. అలా అని వారంతా ప‌నిచేయ‌డం లేదా అంటే చేస్తున్నారు కానీ త‌మకు మ‌ళ్లీ మ‌రో ఛాన్స్ రాద‌నుకుంటున్నారో., లేదా నిత్యం అస‌మ్మ‌తి వాదం వినిపిస్తే మీడియాలో ఉంటామ‌నుకుంటున్నారో కానీ కొంద‌రు కొన్ని వ్యాఖ్య‌లు గీత దాటే చేస్తున్నారు. బొత్స లాంటివారు కూడా కొన్ని సార్లు గీత దాటే స‌చివాల‌యం సాక్షిగా వ్యాఖ్య‌లు చేసి త‌రువాత స‌ర్దుకున్నారు. ఇప్పుడు తాజాగా కొంద‌రు ఎమ్మెల్యేలు ప్లీన‌రీ సాక్షిగా నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో మాట్లాడుతున్నారు. కొంద‌రు కార్య‌క‌ర్త‌ల అసంతృప్తిని త‌మ నెత్తిన వేసుకుని మాట్లాడి, వివాదాల‌కు తావిస్తూ ఉన్నారు.

గ్రామాల్లో కార్య‌క‌ర్త‌ల మాటే కాదు మా మాట కూడా చెల్లుబాటు కావ‌డం లేద‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ప్లీన‌రీల్లో వ్యాఖ్య‌లు చేసి వలంటీర్ వ్య‌వ‌స్థ‌నే పూర్తిగా త‌ప్పు ప‌ట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కొంద‌రు వ‌లంటీర్ల చేష్ట‌లు పార్టీకి క‌ళంకం తెచ్చాయ‌ని చెబుతూ జ‌గ‌న్ సిస‌లు స్ఫూర్తిని మ‌రిచి కొన్ని త‌గాదాల‌ను హైలెట్ చేస్తూ మాట్లాడి మీడియా అటెన్ష‌న్-ను పొందుతున్నారు. ఇవ‌న్నీ పార్టీకి మైన‌స్ అవుతున్నాయ‌ని కొంద‌రు అంటుంటే నిజాలు మాట్లాడితే ల‌డాయి అంటే ఎలా అని కొంద‌రు త‌మ వాద‌న జ‌గ‌న్ వ‌ర‌కూ వెళ్లే విధంగా చేసుకుంటూ వీటి గురించి మ‌రోసారి అధినేత‌ను ఆలోచింప‌జేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యాన వైసీపీలో హీరోల పార్టీ అని కొంద‌రు కాదు కొంత‌మంది విల‌న్లతో కూడిన పార్టీ కూడా అని అంటున్నారే ! సొంత పార్టీలోనే విల‌న్లు ఉన్నార‌ని కూడా బాలినేని లాంటి వారు సీనియ‌ర్లు కొంద‌రు ఆరోపిస్తున్నారే ! అంటే ఉన్నారా అటువంటి వారు ? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఆరాతీస్తే ఉన్నార‌ని కోటంరెడ్డి అంటున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి. ఉన్నార‌ని అంటున్నారు బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి కూడా ! ఇప్పుడు అదే కోవ‌లో ఇంకా చాలా మంది చేరిపోతున్నారు. అంటే అధికార పార్టీలో ఉంటూ పార్టీ సిద్ధాంతాల‌ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న వారు కూడా ఉన్నారు. కొంద‌రు జ‌గ‌న్ చెప్పే మాట‌ల‌ను అర్థం చేసుకోవాల‌ని ప‌దే ప‌దే విన్న‌విస్తుంటే., కాదు కాదు అస్స‌లు ఈ ప‌థ‌కాలే శుద్ధ వృద్ధా, ఇదంతా దండ‌గ మారి ప‌ని అని చెప్పేవారు మ‌రియు అరిచే వారు కూడా ఎక్కువ అయ్యారు.

ప‌థ‌కాల‌కు సంబంధించి అంబేద్క‌ర్ స్ఫూర్తిని వివ‌రిస్తూ రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు లాంటి వారు కాస్త తెలివితో మాట్లాడుతుంటే, ద‌ర్శి ఎమ్మెల్యే మాత్రం ఒక్క బ‌ట‌న్ తో తమ గ్రాఫ్ ఏమీ పెర‌గ‌డం లేద‌ని రీసెంట్ గా కొన్ని అన్ డీసెంట్ కామెంట్స్ చేశార‌ని సొంత పార్టీ నేత‌లే చెబుతూ వ‌స్తున్నారు. వాస్త‌వానికి ఓట్లు కొనుగోలు చేసే ప‌నులే ప‌థ‌కాలు అని టీడీపీ గోల చేస్తే వినొచ్చు. పోనీ ఆ గోల‌కు అర్థం లేద‌ని వైసీపీ కౌంట‌ర్లు ఇవ్వొచ్చు. కానీ సొంత పార్టీ మ‌నుషులే ఈ విధంగా పార్టీని ఇర‌కాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయ‌డం వెనుక ఎవ‌రున్నారు అన్న‌ది అంతుప‌ట్ట‌క ఉంద‌ని వ్యాఖ్యానాలు విన‌వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news